విక్టర్ మోటార్‌సైకిల్‌ను రీలాంచ్ చేయనున్న టీవీఎస్
ఎగ్జిక్యూటివ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో స్టయిలిష్ అండ్ క్లాసిక్ 125సీసీ బైక్ 'ఫినిక్స్'ను ప్రవేశపెట్టిన టీవీఎస్ మోటార్ కంపెనీ, ఇప్పుడు కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌పై దృష్టి సారించనుంది. టీవీఎస్ నుంచి గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పాపులర్ బైక్ 'టీవీఎస్ విక్టర్'ను తిరిగి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా గ్రామీణ, పట్టణ మార్కెట్లలోని కస్టమర్లును టార్గెట్ చేసుకొని అధునాతన ఇంజన్, ఆకట్టుకునే డిజైన్, మెరుగైన మైలేజ్, సరసమైన ధర వంటి ఫీచర్లతో కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది.
గతంలో టీవీఎస్ విక్టర్ మోటార్‌సైకిల్‌ను ఉపయోగించిన వారికి ఈ బైక్ సత్తా ఏంటో కొత్తగా చెప్పాల్సిన అసరం లేదు. అప్పట్లో కమ్యూటర్ బైక్ సెగ్మెంట్లో ఓ వెలుగు వెలిగిన టీవీఎస్ విక్టర్ మరోసారి ఈ సెగ్మెంట్లో తమ ప్రతిభను నిరూపించుకోనుంది. వాస్తవానికి టీవీఎస్ విక్టర్ బైక్‌ను కంపెనీ తమ జపాన్ భాగస్వామి సుజుకి నుంచి విడిపోయిన తర్వాత పూర్తిగా తమ స్వంత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉత్పత్తి. ఇది తొలుత 110సీసీ ఇంజన్‌లో లభ్యమయ్యేది. అనంతరం, కంపెనీ ఇందులో 110సీసీ వేరియంట్‌ను తొలగించి, డిజైన్ మరియు ఇంజన్ పరంగా అప్‌గ్రేడ్ చేయబడిన 125సీసీ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది.
TV
ఇందులో తొలుతగా 125సీసీ స్కూటర్‌ను కతంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన హైబ్రిడ్ స్కూటర్ టీవీఎస్ క్యూబ్‌లో ప్రొడక్షన్ వెర్షన్‌ను కూడా టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిక్యూటివ్ లుక్ కోరుకునే వారి కోసం కంపెనీ రూ.53,000 (ఎక్స్ షోరూమ్, చెన్నై) ధరతో టీవీఎస్ ఫినిక్స్ బైక్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఫినిక్స్‌లో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 11 పిస్‌ల శక్తిని, 10 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో లభించే ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 67 కి.మీ. మైలేజీని (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్ ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications









