విక్టర్ మోటార్‌సైకిల్‌ను పునఃప్రవేశపెట్టనున్న టీవీస్
మీ అందరికీ టీవీఎస్ విక్టర్ గుర్తుండే ఉంటుంది. చెన్నై కేంద్రగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ నాలుగేళ్ల క్రితం నిలిపివేసిన "విక్టర్" మోటార్‌సైకిల్‌ను తిరిగి పునఃప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. గతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టీవీఎస్ విక్టర్ మోడల్‌కు ఇప్పటికీ అంత్యంత క్రేజ్ ఉంది.
నాలుగేళ్ల క్రితం వరకూ దేశీయ మార్కెట్లో కొనసాగిన విక్టర్ బ్రాండ్‌ను నిలిపివేసి దాని స్థానంలో సెంట్రా బ్రాండ్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే, ప్రస్తుతం విక్టర్ బ్రాండ్‌ను రీలాంచ్ చేయాల్సిందిగా కొనుగోలుదారుల నుండి వస్తున్న అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని విక్టర్ మోటార్‌సైకిళ్‌ను పునఃప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది.
ఇప్పటికీ విక్టర్ బ్రాండ్ బైక్‌లకు డిమాండ్ బాగా ఉందని, అందుకనే వీటిని తిరిగి మార్కెట్లోకి తీసుకురానున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) హెచ్.ఎస్. గోయిండి వెల్లడించారు. అంతేకాకుండా, మరో మూడు కొత్త వాహనాలను కూడా మార్కెట్లోకి తీసుకు వస్తామని, అందులో ఓ 125 సీసీబైక్, ఓ 125సీసీ స్కూటర్, మరొక స్కూటర్ ఉంటాయని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications









