సరికొత్త అపాచీ టీజర్‌ను విడుదల చేసిన టీవీఎస్

చెన్నైకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ టీవీఎస్ మోటార్ కంపెనీ అతి త్వరలో ఓ సరికొత్త అద్భుతాన్ని మార్కెట్‌కు పరిచయం చేయనుంది. కంపెనీ అందిస్తున్న స్పోర్ట్స్ బైక్ టీవీఎస్ అపాచీలో ఓ సరికొత్త టాప్-ఎండ్ వేరియంట్‌ను టీవీఎస్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో సరికొత్త అపాచీ మోడల్‌కు సంబంధించిన టీజర్‌ను టీవీఎస్ ఈరోజు (బుధవారం) విడుదల చేసింది. క్రింది ఫోటోలో టీవీఎస్ కొత్త అపాచీ టీజర్ షాట్‌ను చూడొచ్చు.

"న్యూ బీస్ట్. సేమ్ బ్లడ్‌లైన్" (అపాచీ వెర్షన్‌లో పెద్ద వేరియంట్ అని అర్థం వచ్చేలా) అనే క్యాప్షన్‌తో త్వరలో ఆవిష్కృతం కాబోతుందంటూ టీవీఎస్ ఈ టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోటోను బ్టటి చూస్తుంటే కొత్త టీవీఎస్ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉండనున్నట్లు తెలుస్తుంది. దెయ్యపు (మోన్‌స్టర్) కళ్లను తలపించేలా డిజైన్‌ చేసినట్లుండే సరికొత్త హెడ్‌‌లైట్లను కూడా ఈ ఫోటోలో గమనించవచ్చు.


అయితే, టీవీఎస్ మోటార్ కంపెనీ విడుదల చేయబోతున్నది 220సీసీ ఇంజన్ కలిగిన అపాచీనా లేక 250సీసీ ఇంజన్ కలిగిన అపాచీనా అనే సందేహం మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఇది దాదాపు 220సీసీ వేరియంట్ అపాచీనే అయి ఉండొచ్చని అంచనా. ఏదేమైనపట్టికీ కొత్త అపాచీ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే, ఇంకొన్ని రోజులు ఓపికపట్టక తప్పదు మరి.

ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో కూడిన ద్విచక్ర వాహనాన్ని అందిస్తున్న ఏకైక దేశీయ కంపెనీగా కీర్తికెక్కిన టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో అపాచీ స్పోర్ట్స్ బైక్‌లో నాలుగు వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ఆర్‌టిఆర్ 180 ఏబిఎస్, ఆర్‌టిఆర్ 180, ఆర్‌టిఆర్ ఎఫ్1 160, ఆర్‌టిఆర్ 160 హైపర్ ఎడ్జ్ అనే వేరియంట్లను టీవీఎస్ అందిస్తుంది. టీవీఎస్ కొత్త అపాచీకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 18, 2012, 15:46 [IST]
English summary
Chennai based TVS Motor Company has put up a new teasers of the all-new upgraded top-end Apache sports bike on their official Facebook fan page. And it’s hinting at something big is going to come into the market. Here is teaser shot all-new Apache.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+