మహిళలకు టూవీలర్స్ సురక్షితం కాదు: ఆటో కంపెనీలు
ఆర్థిక వ్యక్తిత్వం పెరుగుతున్న నేపథ్యంలో అనేకమంది ఉద్యోగం చేసే మహిళలు వ్యక్తిగత రావాణా కోసం స్వంత వాహనాలను ఉపయోగిస్తున్నారు. దీనికితోడు పనులను వేగంగా చేసుకునేందుకు, పిల్లలను స్కూళ్లకు తీసుకువెళ్లేందుకు, మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకునేందుకు మొదలైన రవాణా అవసరాల కోసం నేటి మహిళలు స్వంత వాహనాలపై ఆధారపడుతున్నారు. నగరాల్లో వాహనాల రద్దీ సమస్య ఎక్కువగా ఉంటుండంతో మహిళలు కార్ల కన్నా ద్విచక్ర వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఫలితంగా, నగరాల్లో ద్విచక్ర వాహనాలపై సంచరించే మహిళల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరిగిపోతుంది. అయితే, మహిళలకు టూవీలర్ రైడింగ్ అంత సురక్షితం కాదనేది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో పరిశీలిస్తే.. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటోమొబైల్ కంపెనీల అభిప్రాయం ప్రకారం, భద్రత, సౌకర్యం, భారీ ట్రాఫిక్ వంటి వివిధ కారణాల వలన ఇలాంటి నగరాల్లో మహిళలు టూవీలర్లను నడిపటం అంత సురక్షితం కాదు.

ఈ విషయంపై సుజుకి మోటార్‌సైకిల్ నేషనల్ మార్కెటింగ్ హెడ్ అను అనామిక మాట్లాడుతూ.. అహ్మదాబాద్, సూరత్, బెంగుళూరు, ఛండీఘడ్, పూనే, ఉదయ్‌పూర్ వంటి ప్రాంతాల్లో మహిళా రైడర్ల సంఖ్య పెరుగుతోందని, ఈ ప్రాంతాల్లో మధ్య వయస్సు కలిగిన వర్కింగ్ ఉమెన్స్ కూడా గేర్‌లెస్ స్కూటర్లను రైడ్ చేస్తున్నారని చెప్పారు. బెంగుళూరు వంటి ప్రాంతాల్లో అయితే, మహిళలకు కార్లు ఉన్నప్పటికీ, అధిక ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని వారు ప్రత్యామ్నాయంగా టూవీలర్లను ఉపయోగిస్తాన్నారని ఆమె తెలిపారు.
అయితే, ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్‌లు, అధిక దూరం రైడ్ చేయటం, అందుబాటులో ఉన్న మెట్రో వంటి వివిధ కారణాల వలన మహిళలు స్కూటర్లను రైడ్ చేయటానికి ఇష్టపడటం లేదని అనామిక అన్నారు. పియాజ్జియో వెహికల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రవి చోప్రా కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో మాత్రం మహిళలు నాలుగు చక్రాల వాహనాలను లేదా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారని, అదే బెంగుళూరు, అహ్మాదాబాద్, పూనే, చెన్నై వంటి ప్రాంతాల్లో అధిక సంఖ్యలో మహిళలు ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారని, ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీలోని ప్రాంతాల్లో ప్రయాణ దూరంతో పోల్చుకుంటే ఈ ప్రాంతాల్లో ప్రయాణ దూరం తక్కువగా ఉండటమేనని ఆయన అన్నారు.
ఢిల్లీలో టూవీలర్లను రైడ్ చేసే మహిళల అభిప్రాయం ప్రకారం, భారీ ట్రాఫిక్ ప్రధాన సమస్య అయినప్పటికీ, భద్రత, సురక్షిత, వాతావరణం వంటి ఆందోళనకర పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయని, ఇది పూర్తిగా అసురక్షితమైనదనేది వారి అభిప్రాయం. అయితే, కొందరు మహిళలు చెప్పే దాని ప్రకారం, సాధారణంగా మహిళలు నెమ్మదిగానే వాహనాలు సురక్షితత్వం అనేది పెద్ద సమస్య కాదనేది వారి వాదన. ఈ సమస్యలు ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. దేశంలోని ప్రతిచోటా ఈ సమస్య ఉంది. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications








