బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ వాడండి.. సురక్షితంగా ప్రయాణించండి

కారులో ప్రయాణిస్తున్నప్పుడు ముందు వెళ్తున్న వాహనాలను గమనించడంతో పాటు వెనుక వైపు నుంచి వస్తున్న వాహనాలను గమనించటం కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయంలో చిన్నపాటి జాగ్రత్త వహించినా పెను ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. వెనుక వైపు వచ్చే వాహనాలను గమనించేందుకు సైడ్ మిర్రర్స్, సెంటర్ రియర్ వ్యూ మిర్రర్లను ఉపయోగిస్తుంటాం.

అయితే, సెడ్ మిర్రర్ల ద్వారా 'బ్లైండ్ స్పాట్స్'ను గమనించడం కష్టమవుతుంది. మలుపులు తీసుకునే సమయంలో వెనుక వాహనం వస్తున్నప్పటికీ, అది సైడ్ మిర్రర్‌లో కనిపించదు, ఆ ప్రాంతాన్నే దీనినే బ్లైండ్ స్పాట్ అంటారు. మరి ఈ బ్లైండ్ స్పాట్‌లను గుర్తించే మార్గం లేదా అని అడిగితే.. ఎందుకు లేదు, ఇందుకు ఒక్కటే పరిష్కారం కారు సైడ్ మిర్రర్లపై బ్లైండ్ స్పాట్ మిర్రర్లను అమర్చుకోవటమే.

రెండు ఇంచ్‌ల పరిమాణం కలిగిన ఈ రౌండ్ బ్లైండ్ స్పాట్ మిర్రర్స్‌ను రియర్ వ్యూ మిర్రర్లపై అతికిస్తే సరిపోతుంది. వీటిని అమర్చుకోవటం వలన బ్లైండ్ స్పాట్‌లో వచ్చే వాహనాలను కూడా సులువుగా గుర్తించడానికి వీలవుతుంది. ఇవి చూడటానికి చిన్నవిగా ఉండి సైడ్ వ్యూ మిర్రర్స్‌పై ఎక్కువ స్థలాన్ని ఆక్రమించవు. కాబట్టి సాధారణ వ్యూ, బ్లైండ్ స్పాట్ వ్యూ రెండింటినీ సైడ్ మిర్రర్స్‌పై స్పష్టంగా చూడొచ్చు.

బ్లైండ్ స్పాట్ వ్యూ మిర్రర్స్‌ను అమర్చుకోవటం చాలా సులువు. మార్కెట్లో ఇవి 100 రూపాయల నుంచి లభ్యమవుతాయి. మరి మీ కారుకు బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ ఉన్నాయా..?

More from DriveSpark

Article Published On: Saturday, September 8, 2012, 15:34 [IST]
English summary
Blind Spot Mirrors are easily mount to the outermost area of the vehicle, eye level to the vehicle's left and right side mirror with double sided foam tape. The mirrors easily mount to the vehicle's left and right side mirrors with pre in sided foam tape and successfully achieved the goal of adding vehicle by enhancing the visibility for the driver, helping the driver to make safe lane change other drivers in the "blind spot" and helping reduce accidents.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+