458 ఇటాలియా కార్ నుంచి స్ఫూర్తి పొంది ఫెరారీ స్మార్ట్ ఫోన్

By Ravi

ఖరీదైన గ్యాడ్జెట్లంటే ఎవరికి మాత్రం మోజు ఉండదు చెప్పండి. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ను చూశారా..? దీని ధర జస్ట్ రూ.4.42 లక్షలు మాత్రమే. అంత ఖరీదు చేయడానికి ఫోన్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా..? దీని పేరు 'కన్స్టెలేషన్ క్వెస్ట్ ఫెరారీ'. లగ్జరీ సెల్‌ఫోన్లను తయారు చేయటంలో ప్రసిద్ధి చెందిన కంపెనీ 'వెర్టు' ఈ ఫోన్‌ను తయారు చేసింది. ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ అందిస్తున్న సూపర్ స్పోర్ట్స్ కార్ 'ఫెరారీ 458 ఇటాలియా' కారు నుంచి స్ఫూర్తి పొంది ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు.


వెర్టు ఇప్పటికే ఇతర ఫెరారీ కార్ల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన చేసిన అసెంట్ ఫెరారీ జిటి, అసెంట్ ఫెరారీ 60 వంటి స్మార్ట్‌ఫోన్‌లను కూడా అభివృద్ధి చేసింది. కన్స్టెలేషన్ క్వెస్ట్ ఫెరారీ షాపైర్ క్రిస్టల్ క్వెర్టీ కీప్యాడ్‌ను, టైటానియం బ్యాటరీ కవర్‌ను కలిగి ఉండి టాకోమీటర్ మాదిరిగా ఉండే గడియారంతో ఫెరారీ ఇంజన్ కోటింగ్ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫెరారీ కార్ వినియోగదారులకు సర్వీస్ లొకేటర్, త్వరలో జరగబోయే ఫెరారీ కార్యక్రమాలు వంటి వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుంది.

కన్స్టెలేషన్ క్వెస్ట్ ఫెరారీ స్మార్ట్‌ఫోన్‌ టైటానియం బ్యాటరీ కవర్‌పై స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయబడిన ఫెరారీ కంపెనీ అధికారిక లోగో 'గుర్రం' (కవల్లినో రెంపాన్టే)ను ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ముందు వైపు పైభాగంలో కూడా ఫెరారీ లోగో ఉంటుంది, అలాగే క్రింది వైపు ప్రీమియం లెథర్‌పై ఫెరారీ అని ఆంగ్లంలో ముద్రించబడి ఉంటుంది. ఫెరారీ ఇంటీరియర్స్‌లో ఉపయోగించే లెథర్‌ను ఇందులోనూ ఉపయోగించారు. అమెరికాలో కన్స్టెలేషన్ క్వెస్ట్ ఫెరారీ స్మార్ట్‌ఫోన్‌ ధర 8,400 అమెరికన్ డాలర్లు మాత్రమే. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 4.42 లక్షలు అన్నమాట.

Article Published On: Tuesday, October 9, 2012, 17:17 [IST]
English summary
Leading luxury cellular phones manufacturer Vertu has brought out a limited edition Ferrari 458 inspired smartphone called Constellation Quest Ferrari. This smartphone has a list price of $8,400 in the US.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+