వెస్పా ఎల్ఎక్స్ 125 ఇప్పుడు అదనపు వారంటీతో!
ఇటాలియన్ టూవీలర్ కంపెనీ పియాజ్జియో దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం లైఫ్‌స్టయిల్ స్కూటర్ 'వెస్పా ఎల్ఎక్స్ 125' ఇప్పుడు అదనపు వారంటీతో లభ్యం కానుంది. కొత్త వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు కంపెనీ 2 ఏళ్లు లేదా 24,000 కి.మీ (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా, మరొక సంవత్సరం లేదా 12,000 కి.మీ. పొడగింపు వారంటీని కేవలం రూ.400 లకే కొనుగోలుదారులు సొంతం చేసుకోవచ్చు. ఈ మొత్తానికి ఇంకొంచెం చేర్చుకోగలిగినట్లయితే మరొక సంవత్సరం వారంటీని కూడా పొందవచ్చు.
అంటే, రూ.550/- చెల్లించినట్లయితే కంపెనీ ఆఫర్ చేస్తున్న 2 ఏళ్లు లేదా 24,000 కి.మీ. వారంటీకి అదనంగా మరో 2 ఏళ్లులేదా 24,000 కి.మీ. పొందవచ్చన్నమాట. అంటే మొత్తం 4 ఏళ్లు లేదా 48,000 కి.మీ. వారంటీ అన్నమాట. ఈ అదనపు వారంటీ స్కీమ్ కేవలం కొత్త కొనుగోలుదారులకు మాత్రమే కాకుండా, ప్రస్తుత వినియోగదారులు కూడా ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే, ప్రస్తుత వెస్పా ఎల్ఎక్స్ 125 వినియోగదారులు, ఈ అదనపు వారంటీ కోసం రూ. 480 (1 సంవత్సరం లేదా 12,000 కి.మీ). రూ. 625 (2 సంవత్సరాలు లేదా 24,000 కి.మీ) చెల్లించాల్సి ఉంటుంది.

వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.26 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు. ఇది ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. ఇది ఎలక్ట్రిక్/కిక్ స్టార్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే.


Click it and Unblock the Notifications








