ఏప్రిల్ 26న మార్కెట్లోకి రానున్న వెస్పా స్కూటర్
వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ విడుదల ఫోటోలు:
ప్రధానంగా 35 నగరాల్లో వెస్పా స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి. వెస్పా స్థానికంగా అసెంబ్లింగ్ చేస్తున్న "ఎల్ఎక్స్ 125" గేర్‌లెస్ స్కూటర్‌ను మార్కెట్లో అందించనుంది. ఈ మోడల్ స్కూటర్ సెగ్మెంట్లోని హోండా యాక్టివా, సుజుకి స్విష్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది. వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌లో 124సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 10.26 బిహెచ్‌పిల శక్తిని, 9.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
వెస్పా ఎల్ఎక్స్ 125లో సివిటి గేర్‌బాక్సును ఉపయోగించారు. ఇది రెడ్, సిల్వర్, యల్లో, ఆరెంజ్, బ్లూ అనే ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. తొలి వెస్పా స్కూటర్‌ను 1946వ సంవత్సరంలో కంపెనీ విడుదల చేసింది. ఇప్పటి వరకూ దాదాపు వందకు పైగా దేశాల్లో 170 లక్షల వెస్పా స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో వెస్పా క్లబ్‌ను కూడా ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications









