యమహా ఆర్ఎక్స్135పై వెంకటేష్, మహేష్‌ల జాలీ రైడ్

విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబుల కలయికలో రానున్న పదహారణాల తెలుగు చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఈ సినిమాపై ఇప్పటికే టాలీవు్డ్‌లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మల్టీ సారర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఇటు వెంకీ ప్రేక్షకులు అటు పోకిరి ప్రేక్షకులు చాలానే ఆశలు పెట్టుకున్నారు.

కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ స్టిల్ బయటకు వచ్చింది. ఇందులో అన్నాదమ్ములుగా నటిస్తున్న వెంకటేష్, మహేష్ బాబులు ఓ యమహా ఆర్ఎక్స్ బైక్‌పై రైడ్ చేస్తూ దర్శనమిచ్చారు. పక్కన ఉండే స్టిల్‌లో గమనించవచ్చు. ఈ సినిమా విడుదల కోసం సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎంతో సాంప్రదాయబద్దంగా చిత్రీకరిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను పూర్తి కుటుంబంతో వచ్చి వీక్షించవచ్చని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ రైడ్ చేసిన యమహా ఆర్ఎక్స్135 బైక్ విషయానికి వస్తే.. ఒకప్పుడు (ఇప్పుడు కూడా అనుకోండి) యువతను ఆకట్టున్న అత్యంత పవర్‌ఫుల్ బైక్ ఇది. దీని సైలెన్సర్ సౌండ్ ఇష్టపడని వారు ఉండరు. యమహా ఆర్ఎక్స్135 తక్కువ బరువును కలిగి ఇన్‌స్టాంట్ పికప్‌ అందిస్తుంది. అంతే కాదండోయ్ ఇది మంచి రైడ్ బ్యాలెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఈ బైక్‌ను ఎక్కువగా డ్రాగ్ రేస్‌లు, స్టంట్‌లు, సర్కస్ ఫీట్లలో ఉపయోగించడాన్ని మనం గమనిస్తుంటాం.

అయితే, ఆధునిక కాలుష్య నిబంధనలను దృష్టిలో ఉంచుకొని యమహా ఈ బైక్‌ను ఉత్పత్తి చేయడాన్ని నిలిపి వేసింది. యమహా ఆర్ఎక్స్100 తర్వాత మరింత శక్తివంతమైన ఇంజన్‌తో కూడిన యమహా ఆర్ఎక్స్135 మోడల్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. అయితే, యమహా ఆర్ఎక్స్100 సక్సెస్ సాధించినంతగా యమహా ఆర్ఎక్స్135 సక్సెస్ సాధించలేక పోయింది. ఏదేమైనప్పటికీ.. మంచి కండిషన్‌ను కలిగి ఉన్న యమహా ఆర్ఎక్స్100 బైక్ కనిపిస్తే కొనుగోలు చేయటానికి ఇప్పటికీ యువత సిద్ధంగానే ఉన్నారంటే.. ఈ మోడల్‌కు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతుంది.

యమహా ఆర్ఎక్స్135 మోటార్‌సైకిల్ 135సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది కేవలం లీటరు పెట్రోల్‌కు 40 కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది. ఇది ప్రతి కిలోమీటరుకు 58 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది (అందుకే దీనిని నిషేధించటం జరిగింది). యమహా ఆర్ఎక్స్135 కేవలం 19.5 సెకండ్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 125 కి.మీ. వేగంతో పరుగులు పెడుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 14, 2012, 10:59 [IST]
English summary
Victory Venkatesh will be riding a Yamaha RX135 motorcycle in his upcoming fil seethamma Vaakitlo Sirimalle Chettu. The Yamaha RX100 is a two stroke bike which is no longer in production. But it is one of the most preferred bikes among motorcycle enthusiasts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+