కస్టమర్ల కోసం మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్: ఫోక్స్‌వ్యాగన్
వర్షాకాలం ఆరంభమైంది..! ఏ వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా వాహనాలను ఎప్పటికప్పుడు కండిషన్‌లో ఉంచుకోవటం ఎంతో అవసరం. రోడ్డుపై వాహణంలో ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణ సమయంలో వాహనంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, వాహనాన్ని తరచూ సర్వీసింగ్ చేయించడం ఎంతో ముఖ్యం. అయితే, స్పేర్ పార్ట్‌లు మార్చాలంటే కాస్తంత ఖర్చుతో కూడుకున్న పనే. కానీ ప్రస్తుతం ఆ సమస్య లేదు.
ఎందుకంటే, జర్మనీకు చెందిన ప్రముఖ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా తమ కస్టమర్ల కోసం ఉచిత మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్‌ను అందిస్తోంది. ఈ సర్వీస్ క్యాంప్‌కు తీసుకువచ్చే ఫోక్స్‌వ్యాగన్ కార్లకు కంపెనీ ఉచిత చెకప్ చేయడమే కాకుండా, ఏవైనా స్పేర్ పార్ట్‌లను మార్చాల్సి వస్తే, తగ్గింపు ధరలకే వాటిని అందించడం కూడా జరుగుతుంది. ఫోక్స్‌వ్యాగన్ మాన్‌సూన్ క్యాంప్ ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి:
* ఉచిత 8 పాయింట్ చెకప్
* ఉచిత విండ్‌షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్
* ప్రత్యేక ధరకే నావిగేషన్ సిస్టమ్
* మడ్ ఫ్లాప్‌పై 10 శాతం డిస్కౌంట్
* రబ్బర్ ఫ్లోర్ మ్యాట్స్‌పై 10 శాతం డిస్కౌంట్
* కార్ కవర్‌పై 10 శాతం డిస్కౌంట్
* డోర్ విజర్స్‌పై 10 శాతం డిస్కౌంట్
పైన తెలిపిన విడిభాగాలన్నీ కూడా వర్షాకాలం సమయంలో మీ కారును సరక్షితంగా ఉంచేందుకు ఎంతో చక్కగా ఉపయోపడుతాయి. ఫోక్స్‌వ్యాగన్ సమ్మర్ చెకప్ క్యాంప్ 2012కు సంబంధించిన మరిన్న వివరాలకు మీ సమీపంలో డీలరును సంప్రదించండి.


Click it and Unblock the Notifications








