మీ టూవీలర్ ఎంత మైలేజ్‌నిస్తుంది..?
సాధారణంగా బైక్‌ను కొనుగోలు చేసేవారు ముందుగా మైలేజ్, ఆ తర్వాత ధరను పరిగణలోకి తీసుకుంటారు. అయితే, ప్రీమియం బైక్‌లను కొనుగోలు చేసేవారు మాత్రం ఈ రెండింటితో సంబంధం లేకుండా కేవలం బ్రాండ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. ఏదేమైనప్పటికీ.. నానాటికీ పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేటి రోజుల్లో మైలేజ్ అధికంగా ఇచ్చే బైక్‌లకే ప్రధాన్యత ఇవ్వటం మంచిది.
అయితే, బైక్‌ల మైలేజ్ అనేది మనం రైడ్ చేసే విధానం, నడిపే రోడ్లు, పేలోడ్, టూవీలర్ యొక్క కండిషన్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్‌ను కొనుగోలు చేసినప్పటికీ, వారికి లభించే మైలేజ్ వేర్వేరుగా ఉండొచ్చు. క్రింద తెలిపిన మా డ్రైవ్ స్పార్క్ పాఠకులు వారి బైక్‌లు ఇచ్చే మైలేజ్ వివరాలను మాతో పంచుకోవటం జరిగింది.
* రంజిత్: ప్యాషన్ ప్రో మైలేజ్ 55-60 కెఎమ్‌పిల్
* అవినాష్ గౌతమ్: హీరో హోండా హంక్ (2007 మోడల్) మైలేజ్ 30 కెఎమ్‌పిల్
* సౌరభ్: పాత హీరో హోండా సిబిజెడ్ మైలేజ్ 52-55 కెఎమ్‌పిల్
* అభిషేక్: హీరో హోండా హంక్ మైలేజ్ 40 కెఎమ్‌పిల్
* విశాల్ ఆర్ పాటిల్: హీరో హోండా సిడి డీలక్స్ మైలేజ్ 60 కెఎమ్‌పిల్
* రాఘవేంద్ర: యమహా ఆర్ఎక్స్ 100 40 కెఎమ్‌పిల్
* ఉమాశంకర్ నటరాజ్: యమహా గ్లాడియేటర్ మైలేజ్ 45-50 కెఎమ్‌పిల్
* సతీష్: యమహా ఆర్15 (పాత వెర్షన్) మైలేజ్ 35-40 కెఎమ్‌పిల్
* నిశాంత్ సింగ్: యమహా ఆర్15 వెర్షన్ 2.0 మైలేజ్ 28-30 కెఎమ్‌పిల్
* ప్రవీన్ చంద్ర: బజాజ్ పల్సర్ 150 మైలేజ్ 45-50 కెమ్‌పిఎల్
* సునీల్ బజాజ్: బజాజ్ ప్లాటినా (100సీసీ) మైలేజ్ 55-60 కెఎమ్‌పిఎల్
* రఘురామ్: బజాజ్ డిస్కవర్ 125సీసీ మైలేజ్ 50-55 కెఎమ్‌పిఎల్
* శరవణరాజన్: సుజుకి జిఎస్ మైలేజ్ 150 53-55 కెఎమ్‌పిఎల్
* అర్జున్ శ్రీధర్: హోండా యాక్టివా మైలేజ్ 45-50 కెఎమ్‌పిఎల్
* జతిన్ : సుజుకి యాక్సెస్ మైలేజ్ 45-48 కెఎమ్‌పిఎల్
* రవి శంకర్: హోండా సిబి షైన్ మైలేజ్ 50-55 కెఎమ్‌పిఎల్
* గౌరవ్: హోండా యునికార్న్ మైలేజ్ - 50 కెఎమ్‌పిల్
మరి మీ బైక్ మోడల్ ఏంటి..? అదెంత మైలేజ్‌ను ఇస్తుంది..?


Click it and Unblock the Notifications








