హీరో ఇంపల్స్, మ్యాస్ట్రో, ఇగ్నైటర్ మోడళ్ల ఉత్పత్తి కొనసాగుతుంది

By Ravi

Hero Products
దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) నుంచి తాజాగా మార్కెట్లోకి ప్రవేశించిన హీరో బ్రాండెడ్ ఇంపల్స్, ఇగ్నైటర్ మోటార్‌సైకిళ్లు, మ్యాస్ట్రో స్కూటర్‌ల ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయనున్నట్లు పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు ఉత్పత్తుల్లో తమ జపాన్ భాగస్వామి హోండా నుంచి పొందిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన కారణంగా వీటి ఉత్పత్తిని హీరో మోటోకార్ప్ నిలిపివేయనున్నట్లు ఓ కథనంలో తెలుసుకున్నాం. అయితే, తాజా సమాచారం ప్రకారం, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని, దేశీయ మార్కెట్లో ఈ మోడళ్లు యధావిధిగానే కొనసాగుతాయని తేలింది.

ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్ ఓవర్‌డ్రైవ్ ప్రచురించిన సమచారం ప్రకారం, ఈ మూడు మోడళ్లు కూడా భారత మార్కెట్లో విడుదలై ఇంకా ఏడాది కూడా పూర్తి చేసుకోకపోవటం, వీటి మార్కెటింగ్ కోసం హీరో మోటోకార్ప్ ఇప్పటికే కోట్ల రూపాయలను ఖర్చు చేసి టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, వార్తా పత్రికల ప్రకటనలు వంటి చేయటం, మరోవైపు కంపెనీ హీరో మ్యాస్ట్రో, హీరో ఇగ్నైటర్ మోడళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడాన్ని బట్టి చూస్తుంటే ఇవి దేశీయ విపణిలో మరికొంత కాలం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

గడచిన సంవత్సరం హీరో హోండా జాయింట్ వెంచర్ నుంచి హోండా విడిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హీరో సాంకేతిక భాగస్వామి కోసం శోధిస్తోంది. కంపెనీ ఇటీవలే ఎరిక్ బ్యూయెల్‌తో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఏదేమైనప్పటికీ.. హీరో, హోండా కంపెనీల మధ్య కుదిరిన లైసెన్స్ ఒప్పందం ప్రకారం, 2012 వరకూ హోండా సాంకేతిక పరిజ్ఞానాన్ని హీరో ఉపయోగించుకోవచ్చు.

హీరో హోండా కంపెనీ హీరో మోటోకార్ప్‌గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ నెలలో హీరో ఇంపల్స్ దేశీయ విపణిలో విడుదలైంది. ఇటు ఆన్-రోడ్, అటు ఆఫ్-రోడ్ ప్రయోజనార్థం రూపొందించిన హీరో ఇంపల్స్ మోటార్‌సైకిల్‌లో 150 సీసీ సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్‌ ఉపయోగించారు. ఇది 13.8 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

అలాగే, గడచిన ఏప్రిల్ నెలలో హీరో మాస్ట్రో స్కూటర్‌ను కంపెనీ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 109సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఓహెచ్‌సి ఇంజన్ ఉపయోగించారు. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.2 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.10 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు సుమారు 60 కి.మీ. మైలేజీనిస్తుంది.

కాగా.. గడచిన ఆగస్ట్ నెలలో హీరో ఇగ్నైటర్‌ మోటార్‌సైకిల్‌ను హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది. ఇందులో ఉపయోగించిన 124.77సీసీ ఏటిఎఫ్‌టి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ 8000 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

More from DriveSpark

Article Published On: Saturday, October 13, 2012, 16:43 [IST]
English summary
According to recent reports, India's largest two wheeler manufacturer Hero MotoCorp will not phase out Impulse and Ignitor motorcycles and Maestro scooter.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+