నిన్జా 300ఆర్, 400ఆర్ బైక్‌లను విడుదల చేయనున్న కవాసకి

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ కవాసకి ఇండియన్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలినియో మరింత విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవల కవాసకి మార్కెట్లోకి విడుదల స్పోర్ట్స్ బైక్ నిన్జా 650ఆర్‌కు మార్కెట్లో మంచి స్పందన లభించండంతో మరిన్ని మోడళ్లను ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

కవాసకి భారతదేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్‌తో కలిసి ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బజాజ్ ఆటోకు ఉన్న ప్రోబైకింగ్ షోరూమ్‌ల ద్వారా కవాసకి తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుతం కవాసకి నిన్జా 250ఆర్, నిన్జా 650ఆర్ స్పోర్స్ట్ బైక్‌లను దేశీయ విపణిలో అందిస్తోంది.

కాగా.. తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా, రానున్న రోజుల్లో నిన్జా 300ఆర్, నిన్జా 400ఆర్ బైక్‌లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న ప్రీమియం స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో వీలైనంత మార్కెట్ వాటాను దక్కించుకోవాలని కవాసకి ప్రణాళికలు రచిస్తోంది.

కవాసకి నిన్జా 300ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో 300సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 39 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, కవాసకి నిన్జా 400ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో 399సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 43 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

ఇకపోతే.. కవాసకి తాజాగా ప్రవేశపెట్టిన సరికొత్త నిన్జా 650ఆర్ విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన 649సీసీ ఫోర్-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ 71 బిహెచ్‌పిల శక్తిని, 65 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కవాసకి నిన్జా 650ఆర్ ఫోటో గ్యాలరీ

కొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను స్టయిలిష్ లుక్, పర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌లతో తీర్చిదిద్దారు. సరికొత్త బాడీ ప్యానెల్స్, ఫ్యూయెల్ ట్యాంక్‌పై ఇగ్నిషన్ కీ, ఎల్ఈడి కన్సోల్, అనలాగ్ టాకోమీటర్, ఎల్ఈడి బ్రేక్ లైట్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ బైక్ సొంతం.

కొత్త కవాసకి నిన్జా 650ఆర్ కేవలం 12.06 సెకండ్ల సమయంలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. సరికొత్త 2012 వెర్షన్ కవాసకి నిన్జా 650ఆర్ స్పోర్ట్స్ బైక్ మూడు ఆకర్షనీయమైన రంగుల్లో (మెటాలిక్ స్పార్క్ బ్లాక్, క్యాండీ లైమ్ గ్రీన్, ప్యాషన్ రెడ్) లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 31, 2012, 11:31 [IST]
English summary
Kawasaki, the Japanese sports bike manufacturer is reportedly planning to expand its Ninja family of sports bikes. The company is said to have developed two new bikes that could be launched as early as next year. The two new sportsbikes from Kawasaki have been named Ninja 300R and Ninja 400R.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+