వోల్వో నుండి పెడస్టేరియన్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీ

స్వీడన్ ఆటోమొబైల్ దిగ్గజంలో ఇటీవలే తమ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'వీ40'ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రపంచంలోనే మరెక్కడా లేని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వోల్వో పరిచయం చేసింది. ఎయిర్‌బ్యాగ్స్ అంటే ఇప్పటి వరకూ కారు లోపల మాత్రమే ఉండేవి. అత్యవసర సమయాల్లో కారు లోపలి ప్రయాణికులను రక్షించేవి. అయితే, వోల్వో తొలిసారిగా ఎక్స్టీరియర్ ఎయిర్‌బ్యాగ్‌ను తయారు చేసి అందరి ప్రశంసలు అందుకుంది.

జెనీవాలో జరుగుతున్న 82 అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ఓ సేఫ్టీ టెక్నాలజీని పరిచయం చేసింది. ప్రమాదవశాత్తూ పాదచారులను గుద్దినప్పుడు కారు బానెట్ ముందు అద్దంవైపుకు (ఫ్రంట్ విండ్‌షీల్డ్) తెరుచుకుని ఓ ఎయిర్‌బ్యాగ్ వెలుపలికి వస్తుంది. కారు ఏ పిల్లర్‌ను పూర్తిగా కవర్ చేస్తూ, కారు ముందు అద్దాన్ని దాదాపు ముక్కాలు భాగం ఈ ఎయిర్‌బ్యాగ్ కవర్ చేస్తుంది. ప్రమాదానికి గురైన పాదచారుడు కారు అద్దంపై లేదా ఏ పిల్లపై పడి బలమైన గాయాల బారిన పడకుండా ఈ ఎయిర్‌బ్యాగ్ అడ్డుకుంటుంది.

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పెడస్టేరియన్ ఎయిర్‌బ్యా సిస్టమ్. వోల్వో వీ40 హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఈ సాంకేతి పరిజ్ఞాన్ని ఉపయోగిస్తుంది. పాదచారునికి (పెడస్టేరియన్) కారు ఫ్రంట్ బంపర్ తగిలనప్పుడు సెన్సార్‌లు యాక్టివేట్ అయ్యి ఈ ఎయిర్‌బ్యాగ్‌ను రిలీజ్ చేస్తాయి. అయితే, వేగంగా వెళ్తున్నప్పుడు పాదచారును ఢీకొడితే అతను కారుపై పడకుండా రోడ్డుపైనో లేదా మరో చోటన పడితే, ఈ ఎయిర్‌బ్యాగ్ తెరచకున్నా ఉపయోగం లేదేమో..! మీరేమంటారు.

More from DriveSpark

Article Published On: Friday, March 9, 2012, 17:54 [IST]
English summary
Swedish carmaker Volvo has come up with world's first pedestrian air bag technology, which was introduced in its latest V40 hatchback. This is the world's first safety technology in cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+