ఆరు సెకండ్లలో 402.8 కి.మీ. వేగంతో పరుగులు పెట్టే బైక్
బైక్‌ను 100 కిలోమీటర్ల స్పీడ్‌తో రైడ్ చేస్తుంటే వామ్మో.. ఇంత స్పీడా.. అని అంటుంటాం. మరి అదే బైక్‌ను గంటకు 400 కిలోమీటర్లకు పైగా వేగంతో సవారీ చేస్తే అయ్యారే అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న బైక్‌ను చూడండి. ఇది అలాంటి బైకే. దీని గరిష్టం వేగం ఎంతో తెలుసా జస్ట్ 402.8 కిలోమీటర్లు మాత్రమే.
ఈ సూపర్‌బైక్ పేరు 'గల్ఫ్ టాప్ ఫ్యూయెల్ డ్రాగ్ రేసింగ్ బైక్'. గతేడాది చివర్లో ఇది ఇండియాకు విచ్చేసింది. గల్ఫ్ ఆయిల్ ప్రమోషన్ యాక్టివిటీలో భాగంగా ఈ సూపర్‌బైక్‌ను డిజైన్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వటం జరుగుతోంది. గల్ఫ్ టాప్ ఫ్యూయెల్ డ్రాగ్ రేసింగ్ బైక్ కేవలం కేవలం 6 సెకండ్లలోపే 402.8 కి.మీ.వేగాన్ని అందుకుంటుంది.
ఈ వేగం ఫార్ములా వన్ రేస్ కార్ల కన్నా, ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కాన్ ఫైటర్ జెట్ విమానం కన్నా అధికం. 6 మీటర్ల పొడవు కలిగిన ఈ సూపర్‌బైక్‌లో 1500 హెచ్‌పి శక్తి కలిగిన ఇంజన్‌తో పని చేస్తుంది. గల్ఫ్ టాప్ ఫ్యూయెల్ డ్రాగ్ రేసింగ్ బైక్‌ను ప్యూమా ఇంజనీరింగ్ సంస్థ డిజైన్ చేసింది.
ఇది సాధారణ పెట్రోల్‌తో కాకుండా నైట్రో మీథేల్ ఇంధనంతో మాత్రమే నడుస్తుంది. గల్ఫ్ టాప్ ఫ్యూయెల్ డ్రాగ్ రేసింగ్ బైక్‌లో అత్యంత అధునాతమైన గల్ఫ్ ప్రైడ్ 4టి ప్లస్ 20డబ్ల్యూ40 ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగించారు. ఈ పవర్‌ఫుల్ బైక్‌ను నడపాలంటే కేవలం కండబలం ఉంటే సరిపోదు.. కాస్తంత గుండె బలం కూడా కావాలి. మీరేమంటారు...?


Click it and Unblock the Notifications








