ఇండియన్ రోడ్లపై 'రే' స్కూటర్‌ను టెస్ట్ చేస్తున్న యమహా
స్పోర్ట్స్ బైక్‌ల స్పెషలిస్ట్ యమహా ఈ ఏడాది భారత మార్కెట్లో స్కూటర్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గడచిన జనవరి నెలలో జరిగిన 11వ అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలో ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ధి చేసిన 'యమహా రే' (Yamaha Ray) స్కూటర్‌ను ఆవిష్కరించిన ఇండియా యమహా మోటార్, ఇప్పుడు అదే స్కూటర్ భారత రోడ్లపై పరీక్షిస్తుంది. యమహా రే స్కూటర్‌కు సంబంధించి రహస్య చిత్రాలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.
వాస్తవానికి ఏ ఆటోమొబైల్ కంపెనీ అయినా తుది ఉత్పత్తి (ఫైనల్ ప్రోడక్ట్)ను మార్కెట్లో విడుదల చేయటానికి ముందు, దానిని సదరు రహదారులు, వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉందో లేదో పరీక్షించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త యమహా రే స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్ కండిషన్‌ను సరిపోతుందో లేదోనని కంపెనీ టెస్ట్ చేసిన తర్వాత, ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటిని చేసిన తర్వాతనే మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేయటం జరుగుతుంది.
ప్రధానంగా భారతీయ యువతులను దృష్టిలో ఉంచుకొని రే స్కూటర్‌ను యమహా డిజైన్ చేయటం జరిగింది. యమహా ప్రపంచ మార్కెట్లలో విస్తృత శ్రేణి స్కూటర్లను అందిస్తుంది. అక్కడి మార్కెట్లలో యమహా బైక్‌ల కన్నా యమహా స్కూటర్లకే మంచి డిమాండ్ ఉంటుంది. కాగా.. 125సీసీ ఇంజన్‌తో ఇండియన్ మార్కెట్లోకి రానున్న యమహా రే స్కూటర్ ఈ సెగ్మెంట్లోని సుజుకి యాక్సెస్, స్విష్, మహీంద్రా డ్యూరో, రోడియో వంటి మోడళ్లకు గట్టిపోటీగా నిలువనుంది.
యమహా బ్రాండ్ అంబాసిడర్, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహామ్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ రే స్కూటర్‌ను ఆవిష్కరించటం జరిగింది. అయితే, అప్పట్లో ఈ స్కూటర్ గురించి యమహా ఎలాంటి సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. యమహా రే స్కూటర్‌లో అమర్చిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనున్నట్లు సమాచారం. సాధారణ స్కూటర్లతో పోల్చుకుంటే ఈ పవర్ చాలా ఎక్కువ. అంటే.. యమహా రే స్కూటర్ యమహా బైక్‌ల మాదిరిగానే పవర్‌ఫుల్‌గా ఉండనుందన్నమాట. దేశీయ విపణిలో ఈ స్కూటర్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








