తమిళనాడులో యమహా మోటార్‌సైకిల్ ప్లాంట్

తమిళనాడు రాష్ట్రం ఆటోమొబైల్ హబ్‌గా మారిపోతుంది. ఆ రాష్ట్ర సర్కారు అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలతో దేశవిదేశాలకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు తమిళనాడులు కాలు మోపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడులో ఓ కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు సర్కారుతో ఈ జపాన్ కంపెనీ ఓ పరస్పర సహకార ఒప్పందంపై సంతకం కూడా చేసింది.

ప్రస్తుతం ఇండియా యమహా మోటార్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. భారత్‌లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కొత్త ప్లాంటును స్థాపించనున్నామని కంపెనీ పేర్కొంది.


చెన్నై సరిహద్దులో ఉన్న వెల్లమ్ వడగల్ పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 4,40,000 చ.మీ. విస్తీర్ణంలో ఓ కొత్త ప్లాంటును నిర్మిస్తామని యమహా తెలిపింది. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ ప్లాంటు ద్వారా 1,800 మంది ఉపాధి పొందనున్నారు. సాలీనా 4 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి సాధించేలా ఈ ప్లాంటును నిర్మిస్తున్నామని, ప్రారంభంలో భాగంగా తొలుత 1.8 లక్షల యూనిట్లతో ప్రారంభించి 2018 నాటికి నాలుగు లక్షల యూనిట్ల స్థాయికి చేర్చుతామని, అప్పటికి సుమారు 6,500 మందికి ఉపాధి లభించగలదని కంపెనీ

రానున్న ఐదేళ్లలో ఈ కొత్త ఫ్యాక్టరీపై సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నామని యమహా తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్‌షిప్‌లను కలిగిన ఉన్న ఇండియా యమాహా మోటార్ కంపెనీ దేశీయ విపణిలో విమ్యాక్స్, ఎమ్‌టి01, వైజెడ్ఎఫ్-ఆర్1, ఎఫ్‌జెడ్1, ఫేజర్, ఎఫ్‌జెడ్-ఎస్, ఎఫ్‌జెడ్, ఎస్‌జెడ్, ఎస్‌జెడ్-ఎక్స్, ఎస్‌జెడ్-ఆర్, వైజెడ్‌ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0, ఎస్ఎస్125, వైబిఆర్ 110, క్రక్స్ మోడళ్లను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, May 14, 2012, 19:45 [IST]
English summary
Yamaha India signed a Memorandum of Understanding with the government of Tamil Nadu today approving the construction and operation of a new two-wheeler factory in the state. The facility will be in addition to Yamaha's Surajpur (UP) and Faridabad (Haryana) units to meet rising demand for two-wheelers in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+