పురుషుల కోసం యమహా నుంచి ఓ 125సీసీ స్కూటర్

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా మోటార్ ఇండియా ఇటీవలే భారతీయ మహిళలను లక్ష్యంగా చేసుకొని ఓ 110సీసీ స్కూటర్ (యమహా రే)ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, పురుషులను లక్ష్యంగా చేసుకొని యమహా ఓ పవర్‌ఫుల్ 125సీసీ స్కూటర్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండియా యమహా మోటార్ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హిరోయుకి సుజుకి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాస్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని రూ.40,000 నుంచి రూ.50,000 ధర రేంజ్‌లో ఓ 125సీసీ స్కూటర్‌ను ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం యమహీ ప్రీమియం, డీలక్స్, కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లలో ద్విచక్ర వాహనాలను అందిస్తోంది. కాగా.. తాజాగా మహిళలను లక్ష్యంగా చేసుకొని రూపొందించిన యమహా రే స్కూటర్ విడులతో కంపెనీ స్కూటర్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించింది.

యమహా అందిస్తున్న లేటెస్ట్ స్కూటర్ రేకు మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. కేవలం గడచిన అక్టోబర్ నెలలోనే కంపెనీ 16,000 యూనిట్ల యమహా రే స్కూటర్లను విక్రయించింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 40,000 స్కూటర్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు తాము ప్రధానంగా స్కూటర్ సెగ్మెంట్ పైనే దృష్టి సారిస్తున్నామని, ఇది భారత్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ద్విచక్ర వాహన విభాగమని సుజుకి తెలిపారు. ప్రస్తుతం మొత్తం ద్విచక్ర వాహన విభాగంలో 20 శాతంగా ఉన్న స్కూటర్ల వాటా 2015 నాటికి 40 శాతానికి పెరవచ్చని ఆయన అన్నారు.

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్

యమహా జెనాన్ 125సీసీ స్కూటర్


పురుషుల కోసం యమహా తీసుకురానున్న ఈ హోండా ఏవియేటర్ స్కూటర్ మాదిరిగా పెద్ద ఆకారాన్ని కలిగి ఉండి, 125సీసీ, 4-స్ట్రోక్ ఇంజన్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. ఈ సెగ్మెంట్లోని హోండా ఏవియేటర్, సుజుకి యాక్సెస్ వంటి 125సీసీ స్కూటర్లతో ఇది తలపడనుంది. మరోవైపు టివిఎస్ మోటార్ కంపెనీ, పియాజ్జియో కంపెనీలు కూడా 125సీసీ సెగ్మెంట్లో స్కూటర్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Monday, November 19, 2012, 11:54 [IST]
English summary
Yamaha is planning to launch a 125cc scooter for Men. Speaking to Financial Chronicle, India Yamaha Motor managing director and chief executive officer Hiroyuki Suzuki said the company will launch a mass market 125cc scooter, which will be priced between Rs 40,000 and Rs 50,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+