లిమిటెడ్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్, ఫేజర్‌లు విడుదల

By Ravi

స్పోర్ట్స్ బైక్‌లను తయారు చేయటంలో పేరుగాంచిన జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా దేశీయ విపణిలో అందిస్తున్న ఎఫ్‌జెడ్-ఎస్, ఫేజర్ మోడళ్లలో రెండు సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్లు కంపెనీ మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రస్తుతం పండుగ సీజన్‌ను దృష్టిలో తమ వినియోగదారులకు కొత్తదనాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో, ఈ రెండు మోడళ్లకు కాస్మోటిక్ మార్పులు చేసి, ఆకర్షనీయమైన రంగుల్లో ఆఫర్ చేస్తోంది. లిమిటెడ్ ఎడిషన్‌ను గుర్తు చేసేలా కొత్త లోగో, సరికొత్త బాడీ పెయింట్, స్టయిలిష్ బాడీ గ్రాఫిక్స్ (స్టిక్కర్స్) వంటి మార్పులను ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌లపై చూడొచ్చు.

ఈ లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్, యమహా ఎఫ్‌జెడ్-ఎస్ బైక్‌ల ధరలు ఇలా ఉన్నాయి:

  • లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్ - రూ.73,030
  • లిమిటెడ్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ - రూ.78,130

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్, ఎఫ్‌జెడ్-ఎస్

యమహా దేశీయ విపణిలో అందిస్తున్న ఎఫ్‌జెడ్-ఎస్, ఫేజర్ మోడళ్లలో రెండు సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్లు కంపెనీ మార్కెట్‌కు పరిచయం చేసింది.

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ధర - రూ.78,130

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్ ధర - రూ.73,030

(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్

యమహా ఫేజర్‌లో అమర్చిన 153సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 14 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.5 సెకండ్లలోనే 0 నుచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఎఫ్‌జెడ్-ఎస్

యమహా ఫేజర్‌లో ఉపయోగించిన 153సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌నే యమహా ఎఫ్‌జెడ్-ఎస్‌ లోను ఉపయోగించారు. ఇది కూడా 14 బిహెచ్‌పిల శక్తిని, 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్, ఎఫ్‌జెడ్-ఎస్ ఫీచర్లు

* శక్తివంతమైన ఇంజన్

* మోనోక్రాస్ సస్పెన్షన్

* వెడల్పాటి రేడియల్ టైర్

* మిడ్‌షిప్ మఫ్లర్ (సైలెన్సర్)

* బాడీ కలర్డ్ రియర్ గ్రాబ్ బార్

* ఫ్రంట్ ఫోర్క్‌పై ఆకర్షనీయమైన యమహా లోగో

యమహా బ్రాండ్ అంబాసిడర్

యమహా మోటార్‌సైకిళ్లకు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


ఎఫ్‌జెడ్ సిరీస్‌ను యమహా తొలిసారిగా 2008లో మార్కెట్‌కు పరిచయం చేసింది. అప్పటి నుంచి ఈ బ్రాండ్‌కు మంచి డిమాండ్ ఉంది. యమహా ఫేజర్, యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఈ రెండు బైక్‌లు కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడళ్లు. నేటి యువతరం ఎక్కువగా ఈ మోడళ్లను ఎంచుకుంటున్నారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లలో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు, కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే.

ఈ రెండు మోడళ్లలో ఒకే రకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. వీటిల్లో అమర్చిన 153సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 14 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.5 సెకండ్లలోనే 0 నుచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

లిమిటెడ్ ఎడిషన్ యమహా ఫేజర్, ఎఫ్‌జెడ్-ఎస్ ఫీచర్లు:

  • శక్తివంతమైన ఇంజన్
  • మోనోక్రాస్ సస్పెన్షన్
  • వెడల్పాటి రేడియల్ టైర్
  • మిడ్‌షిప్ మఫ్లర్ (సైలెన్సర్)
  • బాడీ కలర్డ్ రియర్ గ్రాబ్ బార్
  • ఫ్రంట్ ఫోర్క్‌పై ఆకర్షనీయమైన యమహా లోగో

More from DriveSpark

Article Published On: Thursday, November 8, 2012, 7:15 [IST]
English summary
India Yamaha Motor, has launched the limited edition versions of the bestselling FZ-S & FAZER bikes to boost sales and create more excitement amongst customers during the upcoming festive season. Both the limited edition FZ-S and Fazer bikes have undergone cosmetic changes involving new logo and paint finishes across the motorcycles. Both the bikes come in striking blue color with Limited edition logo on it. The 2012 Yamaha FZ-S Limited Edition model is priced at INR 73,030 while the Fazer will cost INR 78,130, both prices reflecting ex-showroom Delhi figures.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+