ఇండోనేషియాలో యమహా మియో సిరీస్ స్కూటర్ల విడుదల
ఫ్యాషన్‌తో పాటుగా సాంకేతికంగా అభివృద్ధి చెందిన అధునాతన స్కూటర్లను కోరుకునే ఇండోనేషియన్ వాసులను దృష్టిలో ఉంచుకొని యమహా ఈ స్కూటర్లను డిజైన్ చేసింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ రెండు మోడళ్ల డెలివరీలు కూడా నేటి (ఫిబ్రవరి 14, 2012) నుండి ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలో భాగంగా ప్రతి నెలా 25,000 మియో జే స్కూటర్లను విక్రయించాలని యమహా మోటార్స్ ఇండోనేషియా సన్నాహాలు చేస్తుంది.
మియో జే స్కూటర్‌లో 113.7సీసీ, 4-స్ట్రోక్, 2-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 7.75 పిఎస్‌ల శక్తిని, 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్స్, వెడల్పైన పొడవాటి సీట్, విశాలమైన లగేజ్ స్పేస్, పెద్ద ఇంధన ట్యాంక్, సరికొత్త స్పీడోమీటర్ వంటి విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇండోనేషియా మార్కెట్లో దీని ధర 12.7 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్య (మన దేశ కరెన్సీలు సుమారు రూ.70,500).
ఇకపోతే మియో ఫినో స్కూటర్ ఇటు అబ్బాయిలను, అటు అమ్మాయిలను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసిన స్కూటర్. ఇందులో కూడా 113సీసీ, 4-స్ట్రోక్, 2-వాల్వ్, ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8.35 పిఎస్‌ల శక్తిని, 7.84 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇందులో ఆటోమేటిక్ హెడ్‌లైట్ ఆన్ ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 13.5 మిలియన్ ఇండోనేషియన్ రుపయ్య (మన దేశ కరెన్సీలో సుమారు రూ.74,500). ఈ రెండు స్కూటర్లు, ఇప్పట్లో కాకపోయినా, భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications









