అప్‌గ్రేడెడ్ యమహా ఎస్‌జెడ్-ఆర్, ఎస్‌జెడ్-ఎక్స్ విడుదల

యమహా నుండి లభిస్తున్న ఎస్‌జెడ్-ఆర్, ఎస్‌జెడ్-ఎక్స్ వేరియంట్లలో సరికొత్త కలర్ ఆప్షన్లను కంపెనీ ప్రవేశపెట్టింది. యాంత్రికంగా, భౌతికంగా ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే చేసి కొత్త వేరియంట్లను అందిస్తుంది. ప్రస్తుతం ఎస్‌జెడ్-ఆర్ వేరియంట్ మోటార్‌సైకిల్ క్వాలిటీ రెడ్, క్వాలిటీ బ్లాక్, క్వాలిటీ వైట్ అనే మూడు స్పోర్టీ డ్యూయెల్ టోన్ రంగుల్లో లభిస్తుంది.
ఇకపోతే, ఎస్‌జెడ్-ఎక్స్ వేరియంట్ మోటార్‌సైకిల్ రెడ్, బ్లాక్, సిల్వర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈ బైక్‌లలో శక్తివంతమైన 153సీసీ ఎస్ఓహెచ్‌సి ఇంజన్‌ను అమర్చారు. ఇది 7100 ఆర్‌పిఎమ్ వద్ద 12.1 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 12.8 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ డిస్కవర్ 150, సుజుకి జిఎస్-150ఆర్, హోండా యునికార్న్‌లకు ఇవి పోటీగా నిలువనున్నాయి.


Click it and Unblock the Notifications








