రెడీ ఫర్ రిలీజ్: ఈ నెల 14న యమహా రే విడుదల
స్పోర్ట్స్ బైక్‌ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న యమహా, తొలిసారిగా భారత మార్కెట్ కోసం తయారు చేసిన అధునాతన స్టయిలిష్ స్కూటర్‌ను కంపెనీ ఈనెల 14న (సెప్టెంబర్ 14, 2012 శుక్రవారం) మార్కెట్లో వాణిజ్య పరంగా ప్రవేశపెట్టనుంది. యమహా రే స్కూటర్ కోసం కంపెనీ ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ స్కూటర్ విడుదల నాటికి రెండు నెలల ఉత్పత్తికి సరిపడా బుకింగ్‌లు రాగలవని కంపెనీ అంచనా వేస్తోంది. ఇప్పటికే, ఈ యమహా రే స్కూటర్‌కు మార్కెట్లో అశేష ఆదరణ లభిస్తోంది. ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యమహా రే స్కూటర్ కోసం కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ భామ దీపికా పడుకొనేను కంపెనీ నియమించుకుంది.
యమహా రే స్కూటర్‌ను మీరే ముందుగా సొంతం చేసుకోవటం చాలా సులభం, ఇందుకు మీరు చేయాల్సిందల్లా http://epoint.yamaha-motor-india.com/raybookingsopen/ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి, మీ బుకింగ్ వివరాలను నమోదు చేసుకోవటమే. అంతేకాదండోయ్.. మీ అదృష్టం బాగుంటే, యమహా రే స్కూటర్‌ను మీరు ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంటుంది.
ఈ స్కూటర్ కోసం 'గెస్ అండ్ విన్ యమహా రే' అనే కాంటెస్ట్‌ను కూడా కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో భాగంగా, యమహా రే స్కూటర్ ధరను ఖచ్చితంగా అంచనా వేసిన వారు ఉచితంగా యమహా రే స్కూటర్‌ను గెలుచుకోవచ్చు. అంతేకాకుండా, ఈ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకునే మొదటి 1000 మంది లక్కీ కస్టమర్లకు వివిధ అష్షూర్డ్ గిఫ్ట్‌లను కంపెనీ అందిచనుంది.
యమహా నేటి తరం యువతులను దృష్టిలో ఉంచుకొని ఈ స్టయిలిష్, పవర్‌ఫుల్ రే స్కూటర్‌ను తీర్చిదిద్దింది. ఉందులో అమర్చిన పవర్‌ఫుల్ 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనుంది. దేశీయ విపణిలో ఈ స్కూటర్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. యమహా రే స్కూటర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









