యమహా రే స్కూటర్: చిత్రాలతో కూడిన సమీక్ష
యమహా స్కూటర్ల కోసం ఎప్పటి నుండో వేచి చూస్తున్న వారికి శుభవార్త. భారతీయ నారీమణుల కోసం యమహా అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్కూటర్ 'యమహా రే'ను కంపెనీ నేడు (సెప్టెంబర్ 14, 2012 శుక్రవారం) మార్కెట్లో విడుదల చేసింది. కేవలం రూ.46,000 ధర (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కే యమహా ఇండియా ఈ స్కూటర్‌ను ఆఫర్ చేస్తోంది. స్టయిలిష్ స్కూటర్ రే విడుదలతో యమహా భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించినట్లయింది.

యమహా రే - ఇంజన్
ఇంజన్ టైప్ - 113సీసీ, ఎయిర్-కూల్డ్, 2-వాల్వ్ 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి
గరిష్ట పవర్ - 7.1 పిఎస్ @ 7500 ఆర్‌పిఎమ్
గరిష్ట టార్క్ - 8.1 ఎన్ఎమ్ @ 5000 ఆర్‌పిఎమ్

యమహా రే - ట్రాన్సిమిషన్
స్టార్టింగ్ సిస్టమ్ టైప్ - ఎలక్ట్రిక్, కిక్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం - 5 లీటర్లు
ట్రాన్సిమిషన్ టైప్ - వి-బెల్ట్ ఆటోమేటిక్
క్లచ్ టైప్ - డ్రై, సెంట్రిఫ్యూగల్

యమహా రే - టైర్స్, బ్రేక్స్, సస్పెన్షన్
టైర్లు - 90/100-10 53జే (ట్యూబ్ టైప్)
బ్రేక్స్ - 130మి.మీ. డ్రమ్ బ్రేక్
ఫ్రంట్ సస్పెన్షన్ - టెలిస్కోపిక్
రియర్ సస్పెన్షన్ - యూనిట్ స్వింగ్

యమహా రే - కొలతలు
కొలతలు (పొ x వె x ఎ) - 1835 x 675 x 1075
సీట్ ఎత్తు - 760 మి.మీ.
వీల్‌బేస్ - 1270 మి.మీ.
కనీస గ్రౌండ్ క్లియరెన్స్ - 128 మి.మీ.
బరువు - 104 కేజీలు

యమహా రే - కలర్స్, ధర, మైలేజ్
కలర్స్ - పింక్, పర్పల్, బ్లూ, బర్గండి, గ్రే, బ్లాక్
ధర - రూ.46,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
మైలేజ్ - 62.1 కెఎమ్‌పిఎల్
స్పోర్ట్స్ బైక్‌ల తయారీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యమహా స్కూటర్ సెగ్మెంట్లో కూడా ఓ విశిష్టమైన ఉత్పత్తిని ఆఫర్ చేయడం ద్వారా మంచి మార్కెట్ వాటాను ఆర్జించాలనే లక్ష్యంతో రే స్కూటర్‌ను అన్ని విధాలుగా ఆకర్షనీయంగా ఉండేలా తీర్చిదిద్దింది. మెరుగైన యాక్సిలరేషన్, సులువైన హ్యాండ్లింగ్, ఉత్తమమైన రైడ్ కంట్రోల్ వంటి విశిష్టలతో ఈ స్కూటర్‌ను తయారు చేశారు.
యమహా రేలో 113సీసీ 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.1 పిఎస్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 8.1 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్ (సివిటి) సిస్టమ్‌తో లభించే యమహా రే స్కూటర్ లీటరు పెట్రోల్‌కు 62.1 కి.మీ. మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) కంపెనీ పేర్కొంది. యమహా రే స్కూటర్ రెండేళ్లు లేదా 24,000 కి.మీ. (ఏది ముందు మగిస్తే అది) వారంటీతో లభిస్తుంది.
బాలీవుడ్ భామ దీపికా పడుకొనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న యమహా రే స్కూటర్ పింక్, పర్పల్, బ్లూ, బర్గండి, గ్రే, బ్లాక్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








