యమహా రే: విడుదలకు ముందే 5,000 బుకింగ్స్

భారత స్కూటర్ సెగ్మెంట్లోకి మొదటిసారిగా ప్రవేశించనున్న ద్విచక్ర వాహన కంపెనీ యమహా, తలరాతను తిరిగరాసేందుకు వస్తున్న స్టయిలిష్ స్కూటర్ 'యమహా రే' విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. వచ్చే నెల 14న మార్కెట్లోకి విడుదల కానున్న యమహా రే 125సీసీ స్కూటర్ కోసం ఇప్పటికే 5,000 యూనిట్లకు పైగా ముందస్తు బుకింగ్‌లు వచ్చి పడ్డాయి.

యమహా రే స్కూటర్ కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లు ప్రారంభించిన 10 రోజుల్లోనే, ఇది 5,000 బుకింగ్‌లను సొంతం చేసుకొని విడుదలకు ముందే ఘన విజయాన్ని సాధించింది.

యమహా రే ఫోటో గ్యాలరీ

ఈ సందర్భంగా, ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియెన్ మాట్లాడుతూ.. తమ డీలర్‌షిప్ కేంద్రాలలో కేవలం రూ.5,000 నుంచి రూ.10,000 డౌన్‌పేమెంట్‌తో బుకింగ్‌లను స్వీకరిస్తున్నామని, ఇప్పటికే 5,000 యూనిట్లకు బుకింగ్‌లు వచ్చాయని అన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు.

ప్రస్తుత తరం యువతులను దృష్టిలో ఉంచుకొని యమహా ఈ స్కూటర్‌ను డిజైన్ చేసింది. యమహా రే స్కూటర్ స్టయిలిష్ గ్రాఫిక్స్, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, ఆకర్షనీయమైన ఏరోడైనమిక్స్‌లను కలిగి ఉండి నేటి యువతరాన్ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇందులో ఉపయోగించిన పవర్‌ఫుల్ 125సీసీ ఇంజన్‌ గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనుంది. దేశీయ విపణిలో ఈ స్కూటర్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, సుజికి స్విష్, మహీంద్రా డ్యూరో డిజెడ్, మహీంద్రా రోడియో ఆర్‌జెడ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్న యమహా రే స్కూటర్ సెప్టెంబర్ 14, 2012వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది. ఈ స్కూటర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, August 31, 2012, 13:05 [IST]
English summary
Yamaha Ray, the much awaited scooter from Yamaha India gets massive response in the market. Ray scooter received 5,000 bookings in just 10 days. Yamaha Ray scooter to be launched on September 14th, 2012. Company has already opened bookings for Ray Scooter.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+