యమహా రే స్కూటర్ కోసం బుకింగ్స్ ప్రారంభం

ప్రముఖ జపనీస్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ ఇండియా యమహా మోటార్ తొలిసారిగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్న స్కూటర్ 'యమహా రే' కోసం ఇప్పటి నుంచే బకింగ్‌లను అంగీకరిస్తోంది. ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ యమహా రే స్కూటర్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ భామ దీపికా పడుకొనేను కంపెనీ నియమించుకున్న సంగతి తెలిసిందే.


యమహా రే స్కూటర్‌ను ముందుగా సొంతం చేసుకోవాలనుకునే వారు ఇండియా యమహా మోటార్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ స్కూటర్ కోసం 'గెస్ అండ్ విన్ యమహా రే' అనే కాంటెస్ట్‌ను కూడా కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్‌లో భాగంగా, యమహా రే స్కూటర్ ధరను ఖచ్చితంగా అంచనా వేసిన వారికి ఉచితంగా యమహా రే స్కూటర్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, ఈ స్కూటర్‌ను ముందుగా బుక్ చేసుకునే మొదటి 1000 మంది లక్కీ కస్టమర్లకు వివిధ గిఫ్ట్‌లను కంపెనీ అందిచనుంది. మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రానున్న యమహా రే స్కూటర్‌లో పవర్‌ఫుల్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనుంది. దేశీయ విపణిలో ఈ స్కూటర్ ధర రూ.50,000 నుంచి రూ.55,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

భారత స్కూటర్ ఈ సెగ్మెంట్లోని హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, స్విష్, మహీంద్రా డ్యూరో డిజెడ్, రోడియో ఆర్‌జెడ్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. యమాహా రే స్కూటర్‌ ఉత్తరప్రదేశ్‌లోని సర్జాపూర్‌లో ఉన్న యమహా ప్లాంటులో తయారు చేయనున్నారు. యమహీ రే స్కూటర్ల తయారీ కోసం ఈ ప్లాంటులో కంపెనీ కొత్తగా ఓ అసెంబ్లీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, August 13, 2012, 18:05 [IST]
English summary
Yamaha India has opened bookings of its soon to be launched scooter Ray. The Yamaha Ray has a new brand ambassador in the form of Deepika Padukone.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+