యమహా నుంచి ప్రపంచంలో కెల్లా అత్యంత చవక బైక్‌

ప్రపంచంలో కెల్లా అత్యంత చవక ధర కలిగిన మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనున్నామని జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా మోటార్ పేర్కొంది. ఆఫ్రికా, ఇండియా వంటి పటిష్టమైన టూవీల్ మార్కెట్లలోని కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని యమహా మోటార్ ఓ చవక బైక్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇటువంటి మార్కెట్లో తక్కువ ధర కలిగిన మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో, ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ సరికొత్త లో-కాస్ట్ బైక్‌తో మార్కెట్లో రాబోతుంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చవక మోటార్‌సైకిల్ అంటే హీరో మోటోకార్ప్ అందిస్తున్న సిడి డాన్. దీని ధర సుమారు 36,000 నుండి ప్రారంభమవుతుంది. యమహా మోటార్స్ విడుదల చేయనున్న చవక బైక్ ధర 500 డాలర్ల కన్నా తక్కువగా ఉండనుంది. అంటే సుమారు రూ.28,000 లకే యమహా ఓ చవక బైక్‌ను విడుదల చేయనుందన్నమాట. ఈ చీప్ బైక్‌ను ఇండియాలో తయారు చేసి విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయాలని యమహా మోటార్స్ భావిస్తోంది.

దీని గురించి యమహా మోటార్స్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ హిరోయుకి సుజుకి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాము అందిస్తున్న చవక బైక్‌లు వైబిఆర్ 110, క్రక్స్‌ మోడళ్లని, అయితే వీటి కన్నా తక్కువ ధరకే సుమారు 500 డాలర్ల (దాదాపు రూ.27,500) వెల కలిగిన ఓ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, ఆఫ్రికా, ఇండియా వంటి దేశాల్లో ఇలాంటి మోటార్‌సైకిళ్లకు పటిష్టమైన డిమాండ్ ఉంటుందని అన్నారు.

ప్రస్తుతం దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో వివిధ కొత్త మోడళ్ల రాకతో లో-కాస్ట్ బైక్ సెగ్మెంట్లో గట్టి పోటీ వాతావరణం నెలకొంది. హోండా మోటార్‌సైకిల్ కంపెనీ విడుదల చేసిన డ్రీమ్ యుగ (రూ.44,600), సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ విడుదల చేసిన హయాటే (రూ.42,200) వంటి మోడళ్లతో ఎంట్రీ లెవర్ మోటార్‌సైకిల్ విభాగంలో పోటీ పెరిగింది. ప్రస్తుతం యమహా అందిస్తున్న క్రక్స్ మోటార్‌సైకిల్ ధర రూ.38,000 లకు పైగానే ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, May 25, 2012, 15:53 [IST]
English summary
Japanese two-wheeler company Yamaha Motors is planning to launch a low-cost motorcycle for Indian market. Mr Hiroyuki Suzuki, CEO & MD, Yamaha Motors India, said, "Our product benchmark right now (on cost) is the YBR 110 and Crux, but we would like to develop a bike in the low-cost segment for markets like Africa. The target is to make a bike that will cost $500 (about Rs. 27,500). I think such a bike will have a lot of demand in Africa as well as in India."
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+