దీపావళి కానుకగా మార్కెట్లోకి రానున్న యమహా స్కూటర్

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో యమహా ప్రదర్శించిన 'రే' కాన్సెప్ట్ స్కూటర్ గురించి కంపెనీ ఎలాంటి సాంకేతి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే, దాదాపు ప్రొడక్షన్ వెర్షనే అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మార్కెట్ సమాచారం ప్రకారం ఇది 125సీసీ ఇంజన్‌ను కలిగి ఉండి గరిష్టంగా 10 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సాంప్రదాయ స్కూటర్లకు ఈ పవర్ చాలా ఎక్కువ.
ప్రత్యేకించి భారతీయ మహిళలను దృష్టిలో ఉంచుకొని యమహా డిజైన్ చేసిన ఈ స్కూటర్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.50,000 నుండి రూ.55,000 మధ్యలో ఉండొచ్చని అంచనా. గడచిన ఆటో ఎక్స్‌పోలో మియో, ఫినో జెనాన్ అనే మూడు ఇతర స్కూటర్లను కూడా యమహా ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ కండల వీరుడు జాన్ అబ్రహామ్ యమహా రే స్కూటర్‌ను ఆవిష్కరించాడు.


Click it and Unblock the Notifications








