ఐ మార్క్ అవార్డును దక్కించుకున్న యమహా వైజెడ్ఎఫ్-ఆర్15
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న 150సీసీ స్పోర్ట్ మోడల్ మోటార్‌సైకిల్ 'వైజెడ్ఎఫ్-ఆర్15' మరో కొత్త మైలురాయిని అధిగమించింది. యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 బైక్‌ను ఇండియా డిజైన్ కౌన్సిల్ ద్వారా అందించే ప్రతిష్టాత్మక ఇండియా డిజైన్ మార్క్ (ఐ మార్క్) అవార్డు వరించింది.
ఈ సందర్భంగా ఇండియా యమహా మోటార్ సీఈఓ, ఎమ్‌డి హిరోయుకి సుజుకి వ్యాఖ్యానిస్తూ.. తమ ఫ్లాగ్‌షిప్ బైక్ వైజెడ్ఎఫ్-ఆర్15 మోడల్‌కు ఈ అవార్డు దక్కటం చాలా సంతోషంగా ఉందని, 2008లో పరిచయం చేసిన ఈ బైక్ మార్కెట్లో విశేష ఆదరణను సొంతం చేసుకుందని, ఈ మోడల్‌లో 2011లో వచ్చిన అప్‌గ్రేడెడ్ వెర్షన్ 2.0 తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగిందని అన్నారు.
జపనీస్ సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించి, అక్కడి స్టాండర్డ్స్‌ను ఆధారంగా చేసుకొని యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 బైక్‌ను రూపొందించింది. సరసమైన ధరకే మంచి స్పోర్టీ పెర్ఫామెన్స్ కలిగిన బైక్ కోరుకునే వారికి యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 ఓ చక్కటి ఆప్షన్‌గా నిలిచింది.
ఇండియా యమహా మోటార్ గురించి..
* 1985లో తొలుత ఇండియాలోకి ప్రవేశించిన యమహా, ఆగస్టు 2011లో జపాన్‌కు చెందిన యమహా మోటాక్ కో లిమిటెడ్‌కు ఇండియాలో పూర్తి అనుబంధ సంస్థగా మారింది.
* ఇండియా యమహా మోటార్‌కు ఉత్తర ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్, హర్యానాలోని ఫరీదాబాద్‌లలో రెండు ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఈ ప్లాంట్లలో తయారైన ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విక్రయించడమే కాకుండా పొరుగు దేశాలకు కూడా కంపెనీ ఎగుమతి చేస్తుంది.
* సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఇండియా యమహా మోటార్‌కు దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.
* ఇండియా యమహా మోటార్ దేశీయ విపణిలో విమ్యాక్స్ (1,679cc), ఎమ్‌టి01 (1,670cc), వైజెడ్ఎఫ్-ఆర్1 (998cc), ఎఫ్‌జెడ్1 (998cc), ఫేజర్ (153cc), ఎఫ్‌జెడ్-ఎస్ (153cc), ఎఫ్‌జెడ్ (153cc), ఎస్‌జెడ్, ఎస్‌జెడ్-ఎక్స్ & ఎస్‌జెడ్-ఆర్ (153cc), వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0 (150cc), ఎస్ఎస్125 (123cc), వైబిఆర్ 125 (123cc), వైబిఆర్ 110 (106cc) మరియు క్రక్స్ (106cc) మోడళ్లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications








