కొత్త కలర్ ఆప్షన్లతో 2013 హోండా సిబిఆర్ 250ఆర్
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) భారత మార్కెట్లో అందిస్తున్న 250సీసీ స్పోర్ట్స్ బైక్ 'హోండా సిబిఆర్ 250ఆర్'లో మరిన్ని కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది.
ఈ సరికొత్త 2013 హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు స్పోర్ట్స్ రెడ్ (మొత్తం రెడ్ కలర్, ఇంతకు ముందు ఉన్న రెడ్ అండ్ సిల్వర్ మాదిరిగా కాకుండా), స్పోర్ట్స్ బ్లాక్ (మొత్తం బ్లాక్, ఇంతకు ముందు ఉన్న బ్లాక్ అండ్ సిల్వర్ మాదిరిగా కాకుండా), పెరల్ సన్‌బీమ్ వైట్ (కొత్త హెచ్ఆర్‌సి పెయింట్ జాబ్) మరియు పాపులర్ రెప్సోల్ కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.

కొత్త 2013 హోండా సిబిఆర్ 250ఆర్ బైక్‌లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. కేవలం కాస్మోటిక్ మార్పులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఉపయోగించిన ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 25 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 7000 ఆర్‌పిఎమ్ వద్ద 23 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
- హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్ / బ్లాక్ కలర్ (స్టాండర్డ్) - రూ.1,56,900
- హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ రెడ్ / బ్లాక్ కలర్ (ఏబిఎస్) - రూ.1,85,900
- హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్ (స్టాండర్డ్) - రూ.1,57,900
- హోండా సిబిఆర్ 250ఆర్ పెరల్ సన్‌బీమ్ వైట్ (ఏబిఎస్) - రూ.1,86,900
- హోండా సిబిఆర్ 250ఆర్ రెప్సోల్ (ఏబిఎస్) - రూ.1,92,850
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








