మరిన్ని అధనపు ఫీచర్లతో సరికొత్త వెస్పా స్కూటర్ విడుదల
పియాజ్జియో అందిస్తున్న 125సీసీ ప్రీమియం లైఫ్‌స్టయిల్ స్కూటర్ వెస్పాలో మరొక సరికొత్త వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేసింది. ప్రస్తుతం పియాజ్జియా ఆఫర్ చేస్తున్న వెస్పా ఎల్ఎక్స్125 వేరియంట్‌కు ఎగువన, వెస్పా విఎక్స్125 పేరుతో మరిన్ని అదనపు ఫీచర్లు జోడించిన వేరియంట్‌ను కంపెనీ ఆవిష్కరించింది. వెస్పా విఎక్స్125 స్కూటర్‌లో ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇందులో సరికొత్త కలర్ ఆప్షన్స్‌ను పరిచయం చేయటంతో పాటు మరికొన్ని మెకానికల్ మార్పులను చేయటం జరిగింది. అవి:
- 200 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్
- బ్లాక్ సీట్ కవర్ స్థానంలో బీజ్ సీట్ కవర్ (ఆప్షనల్)
- రిఫ్రెష్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
- ఎమ్ఆర్ఎఫ్ నైలాన్ గ్రిప్ జాపర్ ట్యూబ్‌లెస్ టైర్లు
- పింక్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్స్ (బ్లాక్, మెరూన్ కలర్లు నిలిపివేశారు)
- వెనుకవైపు పొడవాటి క్రోమ్ గ్రాబ్ రెయిల్
ఇందులో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10.06 బిహెచ్‌పిల శక్తిని, 10.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది. పియాజ్జియో ఈ కొత్త వేరియంట్ వెస్పా విఎక్స్125 ధరను ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం దేశీయ విపణిలో వెస్పా ఎల్ఎక్స్125 ధర రూ.59,996 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ నేపథ్యంలో వెస్పా విఎక్స్125 ధర దీని కన్నా కాస్తంత అధికంగా ఉండే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

డిస్క్ బ్రేక్
200 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్

బీజ్ సీట్ కవర్
బ్లాక్ సీట్ కవర్ స్థానంలో బీజ్ సీట్ కవర్ (ఆప్షనల్)

ట్యూబ్‌లెస్ టైర్లు
ఎమ్ఆర్ఎఫ్ నైలాన్ గ్రిప్ జాపర్ ట్యూబ్‌లెస్ టైర్లు

పింక్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్స్
పింక్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్స్ (బ్లాక్, మెరూన్ కలర్లు నిలిపివేశారు)

మరిన్ని ఫీచర్లు
రిఫ్రెష్డ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్
వెనుకవైపు పొడవాటి క్రోమ్ గ్రాబ్ రెయిల్

వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్
ప్రస్తతుం మార్కెట్లో లభిస్తున్న వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్.


Click it and Unblock the Notifications








