2014 యమహా వైజెడ్ఎఫ్-ఆర్6 స్పోర్ట్స్‌‌ బైక్ ఆవిష్కరణ

By Ravi

జపనీస్ ఆటో దిగ్గజం యమహా మోటార్ కార్పోరేషన్ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఆర్6 స్పోర్ట్స్ బైక్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2014 యమహా ఆర్6 స్పోర్ట్స్‌బైక్ ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్600ఆర్, కవాసకి జెడ్ఎక్స్-ఆర్ వంటి స్పోర్ట్స్ బైక్‌లతో పోటీ పడనుంది. కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్6 హైపెర్ఫామెన్స్ డైనమిక్స్ కలిగిన మిడ్-వెయిట్ స్పోర్ట్స్‌బైక్. స్టెబిలిటీ, హ్యాండ్లింగ్‌ను పెంచేందుకు గాను కంపెనీ దీని బాడీ వెయిట్‌ను తగ్గించారు. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పులు లేవు.

మునుపటి వెర్షన్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే కొత్త 2014 యమహా వైజెడ్ఎఫ్-ఆర్6 లోను అమర్చారు. ఈ 599సీసీ, లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్, డిఓహెచ్‌సి, 16 టైటానియం వాల్వ్స్ కలిగిన పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 123 బిహెచ్‌పిల శక్తిని, 66 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఈ బైక్‌ను కొత్త జిపి ప్రోగ్రామ్, విస్తరించిన స్టీల్ లెవల్ పెర్ఫామెన్స్ వంటి అనేక ఇతర అంశాలతో మెరుగుపరచారు. ఈ బైక్ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. దీనిని భారత్‌లో విడుదల చేసే అంశంపై కంపెనీ ఏలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ప్రస్తుతం మిడ్-రేంజ్ స్పోర్ట్స్‌‌బైక్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీ వాతావరణాన్ని పరిగణలోకి తీసుకొని యమహా ఈ బైక్‌ను భారత్‌‌లో ప్రవేశపెడితే, ఇది సక్సెస్ సాధించటం ఖాయమని తెలుస్తోంది. మీరేమంటారు..?

2014 Yamaha YZF R6

More from DriveSpark

Article Published On: Monday, September 16, 2013, 16:17 [IST]
English summary
Japanese two-wheeler major Yamaha has introduced the new 2014 YZF-R6 sportsbike for the international markets. The new 2014 Yamaha YZF-R6 is powered by the same 599-cc engine, liquid cooled, inline 4-cylinder engine with DOHC layout that has 16 titanium valves. The engine has max power of 123 BHP of max power and a peak torque of 66Nm at 11,000RPM that comes mated to a 6-speed manual gearbox.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+