వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్ ధరలో మరోసారి తగ్గింపు

By Ravi

పియాజ్జియో వెహికల్స్ భారత మార్కెట్లో అందిస్తున్న ప్రీమియం లైఫ్ స్టయిల్ స్కూటర్ "వెస్పా ఎల్ఎక్స్ 125" ధరలో మరోసారి భారీ తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి పియాజ్జియో ఈ స్కూటర్‌పై ఏకంగా రూ.7,000 లను తగ్గించింది. ధర తగ్గింపు అనంతరం వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్ రూ.59,990 (ఎక్స్-షోరూమ్, పూనే)లకే లభ్యమవుతోంది. పియోజ్జియో స్కూటర్ ఉత్పత్తిలో లోకలైజేషన్‌ను (స్థానికంగా లభించే స్పేర్ పార్ట్‌లను ఉపయోగించి ఉత్పత్తి చేపట్టడం) పెంచడం వలన దీని ఉత్పాదక వ్యయం తగ్గిందని, అలాగే ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచడం వలన వెస్పా స్కూటర్‌ ధరలో ఈ తగ్గింపును అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది.

వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌కు దేశీయ విపణిలో మంచి డిమాండ్ ఉంది. ఈ స్కూటర్ ధర అధికంగా ఉన్నప్పటికీ, దీని ప్రీమియం లుక్ మరియు ఫీచర్లను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులు ముందుకు రావటం జరుగుతోంది. ఇది దేశీయ విపణిలోకి విడుదలైన 8 నెలల్లోనే 25,000 యూనిట్లకు పైగా అమ్మకాలు నమోదయ్యాయి.

Vespa LX125

వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్‌లో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 10.26 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. భారత మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది. ఇందులో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌ను ఉపయోగించారు.

వెస్పా ఎల్ఎక్స్ 125లో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యమవుతుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇది ఎలక్ట్రిక్ స్టార్ట్ లేదా కిక్ స్టార్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే. ఇండియన్ కస్టమర్ల కోసం ఎక్స్‌క్లూజివ్ యాక్ససరీస్, మర్చండైస్‌లను కూడా పియాజ్జియో ఆఫర్ చేయనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 9, 2013, 11:09 [IST]
English summary
Piaggio has slashed prices for its premium lifestyle scooter Vespa LX125 again. Piaggio said that due to completion of the localization process and a higher production they could revise the price and share the benefits with the customers. Now the Vespa LX125 is available at Rs. 59,990/- (ex-showroom, Pune).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+