ఏప్రిల్ నెలలో 12 శాతం తగ్గిన బజాజ్ ఆటో అమ్మకాలు

By Ravi

Bajaj Bike Sales
ఒకప్పుడు భారత ద్విచక్ర వాహన సెగ్మెంట్లో ద్వితీయ స్థానంలో కొనసాగిన బజాజ్ ఆటో ఇప్పుడు మూడవ స్థానానికి దిగజారిపోయింది. జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా ఇటీవలే బజాజ్ ఆటోను ఓవర్‌టేక్ చేసి ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, గడచిన నెలలో కూడా బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

ఏప్రిల్‌ 2013లో బజాజ్ ఆటో అమ్మకాలు 12.12 శాతం తగ్గి 3,00,827 యూనట్లుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం ఇదే నెలలో కంపెనీ అమ్మకాలు 3,42,324 యూనిట్లుగా ఉన్నట్లు బజాజ్ ఆటో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఈ సమయంలో కంపెనీ ఎగుమతుల విషయానికి వస్తే, అవి 22.89 శాతం పెరిగి 1,30,329 యూనిట్లుగా నమోదయ్యాయని, అంత క్రితం సంవత్సరంలో ఇవి1,69,010 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

ఇకపోతే బజాజ్ ఆటో విక్రయిస్తున్న త్రిచక్ర వాహనాల విషయానికి వస్తే, ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 10.40 శాతం వృద్ధి చెంది 39,266 యూనిట్ల నుంచి 43,351 యూనిట్లకు పెరిగాయని కంపెనీ తెలిపింది. మొత్తమ్మీద చూసుకుంటే, ఏప్రిల్ కంపెనీ మొత్తం అమ్మకాలు 3,44,178 యూనిట్లుగా నమోదు కాగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయానికి 3,81,590 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే కంపెనీ మొత్తం అమ్మకాలు 9.80 శాతం తగ్గుదలను నమోదు చేశాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 3, 2013, 13:31 [IST]
English summary
The country's third largest two-wheeler maker Bajaj Auto today reported 12.12 per cent fall in its motorcycle sales at 3,00,827 units in April 2013. The company had sold 3,42,324 units in the corresponding month last year, Bajaj Auto Ltd (BAL) said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+