బజాజ్ ఛాకన్ ప్లాంటులో ముగిసిన వర్కర్ల సమ్మె!

వికెకెఎస్ ఛాకన్ ప్లాంటులో బేషరతుగా సమ్మె విరమించిందని తెలియజేయటానికి నేను సంతోషిస్తున్నాని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విషయమై వికెకెఎస్ ప్రెసిడెంట్ దిలీప్ పవార్‌ను సంప్రదించగా, అందరి కోరిక మేరకే సమ్మెను విరమించామని, బుధవారం నుంచి పనులు కొనసాగిస్తామని చెప్పారు.
ఛాకన్ ప్లాంటులోని వర్కర్లు గడచిన జూన్ నెల 25వ తేది నుంచి సమ్మెకు దిగారు. వేతనాల సవరణ, ప్లాంటులో మంచి పని వాతారణాలను ఏర్పాటు చేయాలంటూ సుమారు 2000 మంది కార్మికులు ఈ సమ్మె ప్రారంభించారు. ఇటీవలే రాజీవ్ బజాజ్ సమ్మె విరమించకపోతే, ప్లాంటును ఛాకన్ నుంచి తరలిస్తామని అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో వర్కర్లు బేషరతుగా సమ్మె విరమించటం గమనార్హం.
ఏదేమైనప్పటికీ, ఈ సమ్మె వల్ల బజాజ్ ఆటో తీవ్రంగానే నష్టపోయింది. ఈ సమ్మె వలన కొన్ని రకాల బాజాజ్ మోటార్‌సైకిళ్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా కంపెనీ అమ్మకాలు కూడా క్షీణించాయి. గడచిన జులై నెలలో తొలిసారిగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కంపెనీ బజాజ్ ఆటోను ఓవర్‌టేక్ చేసి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించుకుంది.


Click it and Unblock the Notifications








