సరికొత్త 100సీసీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన బజాజ్
దేశపు ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో, తమ అధునాతన 100సీసీ మోటార్‌సైకిల్‌ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. 100సీసీ బైక్ సెగ్మెంట్లోని ఇతర మోటార్‌సైకిళ్ల గట్టి సవాలను విసురుతూ, ఈ సెగ్మెంట్లో మరే ఏ బైక్‌కు లేనటువంటి ప్రీమియం ఫీచర్లతో తయారు చేసిన తమ కొత్త మోటార్‌సైకిల్ 'డిస్కవర్ 100టి' (టి అంటే టూరింగ్ అని అర్థం)ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేసింది. బజాజ్ డిస్కవర్ 100టి (Bajaj Discover 100T) టూరింగ్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ తాజాగా ఆవిష్కరించిన 125సీసీ మోటార్‌సైకిల్ డిస్కవర్ 125ఎస్‌టి (స్పోర్ట్స్ టూరర్)ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసింది.
డిస్కవర్ 125ఎస్‌టి మరియు డిస్కవర్ 100టి మోటార్‌సైకిళ్లలో దాదాపు ఒకేరమైన డిజైన్, ఫీచర్లను మనం గమనించవచ్చు. ఇందులో 125సీసీ వేరియంట్ వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ సెంటర్ సస్పెన్షన్)తో లభిస్తుండగా 100సీసీ వేరియంట్‌లో రెండు వైపులా నైట్రాక్స్‌తో నింపబడిన సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఇందులో ఉపయోగించిన అధునాతన 100సీసీ, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 10.2 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి 100సీసీ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర బైక్‌లతో పోల్చుకుంటే దాదాపు 30 శాతం అధికం.

బజాజ్ డిస్కవర్ 100టి
బజాజ్ ఆటో, తమ అధునాతన 100సీసీ మోటార్‌సైకిల్ 'డిస్కవర్ 100టి' (టి అంటే టూరింగ్ అని అర్థం)ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది.

బజాజ్ డిస్కవర్ 100టి
డిస్కవర్ 100టిలో ఉపయోగించిన అధునాతన 100సీసీ, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 10.2 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి 100సీసీ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర బైక్‌లతో పోల్చుకుంటే దాదాపు 30 శాతం అధికం.

బజాజ్ డిస్కవర్ 100టి
బజాజ్ డిస్కవర్ 100టి మోటార్‌సైకిల్ లీటరు పెట్రోల్‌కు 87 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్‌బాక్స్‌తో ఈ లభించే ఈ మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.

బజాజ్ డిస్కవర్ 100టి
భారత మార్కెట్లో కొత్త బజాజ్ డిస్కవర్ 100టి ధర రూ.50,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ డిస్కవర్ 100టి
బజాజ్ డిస్కవర్ 100టి మోటార్‌సైకిల్ లీటరు పెట్రోల్‌కు 87 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్‌బాక్స్‌తో ఈ లభించే ఈ మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. భారత మార్కెట్లో కొత్త బజాజ్ డిస్కవర్ 100టి ధర రూ.50,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ బాడీ గ్రాఫిక్స్, సరికొత్త డిజైన్, 10-స్పోక్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం ఫినిష్‌తో కూడిన సైడ్ ప్యానెల్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ఫీచర్లతో ఇది ప్రీమియం మోటార్‌సైకిల్‌ను అనుభూతిని అందిస్తుంది. ఇది నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (ఫ్లేమ్ రెడ్, బ్రిలియంట్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ) లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








