రూ.5,000 మేర పెరగనున్న బజాజ్ బైక్ ధరలు

By Ravi

దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ అందిస్తున్న ద్విచక్ర వాహనాల ధరలు త్వరలోనే మరింత ప్రియం కానున్నాయి. మరికొద్ది రోజుల్లోనే తమ మోటార్‌సైకిళ్ల ధరలను మోడల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.5,000 మేర పెంచనున్నామని బజాజ్ ఆటో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ టెలివిజన్ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అధిక ఇన్‌పుట్ ఖర్చులు, బలహీన పడుతున్న రూపాయి విలువ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ధరలను పెంచుతామని బజాజ్ ఆటో గడచిన నెలలో ప్రకటించింది. అయితే, ఆ సమయంలో ఎంత మేర ధరలను పెంచుతున్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. మరి ధరలు పెరగక ముందే ఇప్పుడే వెళ్లి మీ బజాజ్ బైక్‌ను సొంతం చేసుకోండి.

Bajaj Auto

ఇదిలా ఉండగా, గడచిన సెప్టెంబర్ నెలలో బజాజ్ ఆటో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 3 శాతం వృద్ధి చెంది 3,23,879 యూనిట్లుగా నమోదయ్యాయి. గడచిన సంవత్సరం సెప్టెంబర్‌లో నెలలో ఈ అమ్మకాల సంఖ్య 3,15,314 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదే సమయంలో కంపెనీ ఎగుమతులు 10 శాతం వృద్ధిని సాధించి 1,33,222 యూనిట్ల నుంచి 1,46,847 యునిట్లకు పెరిగాయి. మొత్తమ్మీద సెప్టెంబర్‌ 2012లో బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు 3,60,152 యూనిట్లుగా ఉంటే, సెప్టెంబర్‌ 2013లో ఇవి 2 శాతం వృద్ధిని సాధించి 3,67,815 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.

More from DriveSpark

Article Published On: Thursday, October 3, 2013, 12:54 [IST]
English summary
Indian's leading motorcycle manufacturer Bajaj Auto Ltd has said, it will raise the prices of its entire range of motorcycles in the next few days. The hike will be ranging from Rs 500 to Rs 5,000 depending on the model.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+