విదేశాలకు పయనం కానున్న బజాజ్ డిస్కవర్ 100టి

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో, తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసిన అధునాత 100సీసీ మోటార్‌సైకిల్‌ 'డిస్కవర్ 100టి' (టి అంటే టూరింగ్ అని అర్థం)ను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు, సరికొత్త డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని మైలేజ్, పటిష్టమైన నిర్మాణం వంటి పలు కీలక అంశాలతో రూపుదిద్దుకున్న బజాజ్ డిస్కవర్ 100టి మరో 4-5 నెలల తర్వాత విదేశీయ మార్కెట్లలోకి ప్రవేశించనుంది.

ప్రారంభంలో భాగంగా, ఈ మోడల్ విషయంలో ప్రస్తుతం తాము దేశీయ మార్కెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, మరో నాలుగైదు నెలల తర్వాత ఈ మోటార్‌సైకిల్‌ను ఎగుమతి చేస్తామని బజాజ్ ఆటో జనరల్ మేనేజర్ ఆర్ చంద్రశేఖర్ (సేల్స్) తెలిపారు. బజాజ్ ఆటో ఇప్పటికే పల్సర్, డిస్కవర్ వంటి కొన్ని ఉత్పత్తులను ధక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా మరియు ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది. బజాజ్ ఆటో అందిస్తున్న డిస్కవర్ 125ఎస్‌టి (స్పోర్ట్స్ టూరర్) ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ తమ సరికొత్త డిస్కవర్ 100టి మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేసింది.

Bajaj Discover 100T

ఈ రెండు మోడళ్లలో దాదాపు ఒకేరకమైన డిజైన్, ఫీచర్లను మనం గమనించవచ్చు. 125సీసీ వేరియంట్‌లో వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ సెంటర్ సస్పెన్షన్)తో ఉపయోగించగా, 100సీసీ వేరియంట్‌లో రెండు వైపులా నైట్రాక్స్‌తో నింపబడిన సస్పెన్షన్‌ను ఉపయోగించారు. ఇందులో అమర్చిన అధునాతన 100సీసీ, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 10.2 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి 100సీసీ సెగ్మెంట్లో లభిస్తున్న ఇతర బైక్‌లతో పోల్చుకుంటే దాదాపు 30 శాతం అధికం. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా డ్రీమ్ యుగ, హీరో ప్యాషన్ ప్రో వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

బజాజ్ డిస్కవర్ 100టి మోటార్‌సైకిల్ లీటరు పెట్రోల్‌కు 87 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్‌బాక్స్‌తో ఈ లభించే ఈ మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. భారత మార్కెట్లో కొత్త బజాజ్ డిస్కవర్ 100టి ధర రూ.50,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ బాడీ గ్రాఫిక్స్, సరికొత్త డిజైన్, 10-స్పోక్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం ఫినిష్‌తో కూడిన సైడ్ ప్యానెల్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ఫీచర్లతో ఇది ప్రీమియం మోటార్‌సైకిల్‌ను అనుభూతిని అందిస్తుంది. ఇది నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (ఫ్లేమ్ రెడ్, బ్రిలియంట్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ) లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 15, 2013, 11:27 [IST]
English summary
Bajaj Auto is planning to export its latest 100cc motorcycle 'Discover 100T' (Tourer) to overseas markets. "Initially we are looking at the domestic market. May be after four or five months, we will be looking exports of this motorcycle", Bajaj Auto General Manager(Sales), R Chandrasekar said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+