నేపాల్ మార్కెట్లో విడుదలైన బజాజ్ డిస్కవర్ 100టి

By Ravi

ఈ బైక్ ధర చూసి కంగారు పడిపోకండి. మన దేశంలో ఇది 50 వేల రూపాయిలకే దొరుకుతుంది. అయితే, నేపాల్ మార్కెట్లో మాత్రం బజాజ్ డిస్కవర్ 100టి బైక్‌ను కొనుగోలు చేయాలంటే రూ.1.56 లక్షలు చెల్లించక తప్పుదు. బజాజ్ ఆటో తమ పాపులర్ డిస్కవర్ బ్రాండ్‌లో ప్రవేశపెట్టిన స్టయిలిష్ 100సీసీ బైక్ డిస్కవర్ 100టి ఎగుమతుల గురించి గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా.. ఇప్పుడు బజాజ్ ఆటో ఈ బైక్‌ను నేపాల్ మార్కెట్లో విడుదల చేసింది.

పూర్తిగా భారత్‌లో తయారైన బజాజ్ డిస్కవర్ 100టి బైక్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో నేపాల్‌కు దిగుమతి చేసుకొని అక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. దిగుమతి చేసుకునే వాహనాలపై నేపాల్ ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాలు మరియు రూపాయి విలువతో పోల్చుకుంటే నేపాల్ కరెన్సీ విలువ తక్కువగా ఉండటం వలన అక్కడి మార్కెట్లో ఇది అంత అధిక ధర పలుకుతోంది.

Bajaj Discover 100T

ఎక్స్‌పోర్ట్ వెర్షన్ డిస్కవర్ 100టి బైక్, ఇండియన్ వెర్షన్ డిస్కవర్ 100టి బైక్‌కు మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేవు. ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలు, సరికొత్త డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని మైలేజ్, పటిష్టమైన నిర్మాణం వంటి పలు కీలక అంశాలతో బజాజ్ ఆటో ఈ డిస్కవర్ 100టి బైక్‌ను అభివృద్ధి చేసింది. ఇటీవల బజాజ్ విడుదల చేసిన డిస్కవర్ 125ఎస్‌టి (స్పోర్ట్స్ టూరర్) ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ తమ సరికొత్త డిస్కవర్ 100టి మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేసింది.

బజాజ్ డిస్కవర్ 100టి మోటార్‌సైకిల్‌లో అమర్చిన అధునాతన 100సీసీ, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్, డిటిఎస్-ఐ ఇంజన్ గరిష్టంగా 10.2 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరు పెట్రోల్‌కు 87 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యవల్ గేర్‌బాక్స్‌తో ఈ లభించే ఈ మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఆకర్షనీయమైన డ్యూయెల్ టోన్ బాడీ గ్రాఫిక్స్, సరికొత్త డిజైన్, 10-స్పోక్ అల్లాయ్ వీల్స్, అల్యూమినియం ఫినిష్‌తో కూడిన సైడ్ ప్యానెల్స్, పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ వంటి ఫీచర్లతో ఇది ప్రీమియం మోటార్‌సైకిల్‌ను అనుభూతిని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 5, 2013, 14:41 [IST]
English summary
Bajaj Auto has launched its latest 100cc motorcycle 'Discover 100T' (Tourer) in Nepal market. The motorcycle sold in Nepal is exported from India as a completely built unit (CBU). Discover 100T is priced ar of 1.56 lakh Nepali rupees.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+