పెర్ఫామెన్స్ వెర్షన్ బజాజ్ పల్సర్ 375 చిత్రాలు లీక్!
ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో పెద్ద ఇంజన్‌తో కూడిన ఓ పెర్ఫామెన్స్ వెర్షన్ పల్సర్ స్పోర్ట్స్ బైక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. తాజాగా.. బజాజ్ అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త పల్సర్ బైక్‌కు సంబంధించిన ఫొటోలో ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. విజర్‌డౌన్ ఓ ఇంటర్నెట్ బ్లాగ్ ఈ ఫొటోలను క్యాప్చూర్ చేసింది.
ఈ ఫొటోలు అస్పష్టంగా ఉన్నప్పటికీ, వీటిని బట్టి చూస్తుంటే, కొత్త బజాజ్ పల్సర్ 375 విశిష్టమైన స్టయిలింగ్‌తో, ఇదివరకెన్నడూ లేని డిజైన్‌తో బైక్ ప్రియులను ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రియాకు చెందిన తమ భాగస్వామి కెటిఎమ్‌తో కలిసి బజాజ్ ఆటో 300సీసీ ఎగువన ఓ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది.

కెటిఎమ్ ఆర్‌సి 390ని పోలి ఉండే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బాడీ కౌల్, స్ప్లిట్ సీట్స్, పొట్టిగా ఉండే పెద్ద సైలెన్సర్, గోల్డ్ కలర్‌లో ఉండే ఇంజన్లను ఈ ఫొటోలో గమనించవచ్చు. ఇంకా ఈ బైక్‌లో డిజిటల్ మరియు అనలాగ్ కాంబినేషన్ మీటర్ కన్సోల్, ముందువైపు టెలిస్కోపిక్ వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్స్, వెడల్పాటి వెనుక టైర్, ముందు వెనుక డిస్క్ బ్రేక్స్ (ఏబిఎస్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది) కూడా ఉండనున్నాయి.
కెటిఎమ్ డ్యూక్ 390లో ఉపయోగించిన ఇంజన్‌ను ఆధారంగా చేసుకొని కొత్త పల్సర్‌లో 373సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ కెటిఎమ్ డ్యూక్ 390 మాదిరిగానే, 43 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా. కొత్త పల్సర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








