టీవీఎస్‌తో అభివృద్ధి చేసిన బైక్‌లను ఎగుమతి చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ద్విచక్ర వాహన విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ మరియు చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన విభాగం టీవీఎస్ మోటార్ కంపెనీలు భారత్‌లో తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన స్పోర్ట్స్ బైక్‌లను తయారు చేసేందుకు గడచిన ఏప్రిల్ నెలలో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసినదే.

తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ రెండు సంస్థలు ఇప్పటికే ఓ బైక్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ జాయింట్ వెంచర్ నుంచి రానున్న కొత్త బైక్ రెండు బ్రాండ్ క్రింద (బిఎమ్‌డబ్ల్యూ, టీవీఎస్) అమ్ముడుపోనుంది. ఇది టీవీఎస్‌కి హై-ఎండ్ బైక్ అయితే, బిఎమ్‌డబ్ల్యూకి లో-ఎండ్ బైక్ అవుతుందని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వోన్ సాహ్ తెలిపారు.


భవిష్యత్తులో, భారత్‌లో ఉత్పత్తి అయ్యే ఇలాంటి ద్విచక్ర వాహనాలను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తామని ఆయన వివరించారు. ఏప్రిల్ 2013లో ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా టీవీఎస్, బిఎమ్‌డబ్ల్యూ కంపెనీలు తయారు చేసే ద్విచక్ర వాహనాలను దేశీయ మార్కెట్లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోకూడా విక్రయించేందుకు సన్నాహాలు చేయనున్నారు.

బిఎమ్‌డబ్ల్యూ సాంకేతిక సహకారాన్ని ఉపయోగించుకొని తమ ప్లాంటులో అధునాతన మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీవీఎస్ మోటార్ కంపెనీ కసరత్తులు ప్రారంభించింది. ఈ ఒప్పందంలో భాగంగా, మొదటి ఉత్పత్తిని 2015 నాటికి మార్కెట్లో విడుదల చేస్తామని, ఇందుకోసం రూ.142 కోట్లు పెట్టుబడులు వెచ్చిస్తున్నామని గతంలో టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ చెప్పారు.

TVS Apache

బైక్‌ల డెవలప్‌మెంట్, టెస్టింగ్ వ్యయాన్ని బిఎమ్‌డబ్ల్యూ భరిస్తుందని, తయారీకి కావల్సిని వసతులను తాము సమకూర్చుతమాని కంపెనీ పేర్కొంది. ద్విచక్ర వాహనాల తయారీలో అనుభవం ఉన్న టీవీఎస్‌ మోటార్‌ కంపెనీతో భాగస్వామ్యం వలన తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తీసుకువచ్చి తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతంగా పెంచుకోవాలని బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్‌ యోచిస్తోంది.
Most Read Articles

English summary
BMW's motorcycle division BMW Motorrad may export motorbikes it is developing with Indian partner TVS Motor Company. "We are looking forward to developing a motorbike, which is for TVS on the higher end, for BMW on the lower end. Maybe also in the long term, we also want to export such bikes" said Philipp von Sahr, president of BMW Group India.
Story first published: Friday, September 6, 2013, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X