కవాసకి నిన్జా 300 బుకింగ్స్ ప్రారంభం; ఏప్రిల్ 10న విడుదల
భారత మార్కెట్లో కవాసకి అందిస్తున్న నిన్జా 250 స్పోర్ట్స్ బైక్‌ను రీప్లేస్ చేస్తూ కంపెనీ తమ సరికొత్త నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌ను ఈనెల 10వ తేదీన మార్కెట్లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో కవాసకి నిన్జా 300 బైక్ కోసం బుకింగ్‌లు ప్రారంభించామని బజాజ్ ఆటో లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఏప్రిల్ 10, 2013వ తేదిన ఈ బైక్‌ను పూనేలో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలోని అన్ని బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్‌లలో కవాసకి నిన్జా 300 బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.
జపాన్‌కు చెందిన కవాసకి భారత ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటోతో చేతులు కలిపి ఇక్కడి మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. నిన్జా సిరీస్‌లో కవాసకి అందిస్తున్న 250సీసీ వేరియంట్ నిన్జా 250 స్పోర్ట్స్ బైక్ స్థానాన్ని భర్తీ చేస్తూ మార్కెట్లోకి రానున్న ఈ 300సీసీ బైక్, నిన్జా 250తో పోల్చుకుంటే సరికొత్త స్టయిలింగ్‌ను కలిగి ఉంటుంది. కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, ఫ్లోటింగ్ విజర్, రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్, లార్జర్ ఫెయిరింగ్ వెంట్స్ వంటి డిజైన్ మార్పులను ఈ కొత్త బైక్‌లో గమనించవచ్చు.

ఈ బైక్‌లోని రేడియేటర్ ఫ్యాన్ కౌల్ బైక్ నడుపుతున్నప్పుడు ఇంజన్ నుంచి వెలువడే వేడిని రైడర్‌కు తగలకుండా చేస్తుంది. ఈ సరికొత్త కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌లో 296సీసీ, పారలల్ ట్విన్-సిలిండర్, ఫ్యూయెల్ ఇంజక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 38.8 బిహెచ్‌పిల శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 27.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.
డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, 37 మి.మీ. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, లింక్డ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్, ముందు వైపు 290 మి.మీ., వెనుక వైపు 220 మి.మీ. నిస్సిన్ డిస్క్ బ్రేక్స్ ఇందులో చెప్పుకోదగిన ప్రత్యేకతలు. కవాసకి నిన్జా 300 బైక్ ధర, ఇతర వివరాలను కంపెనీ ఏప్రిల్ 10న వెల్లడించనుంది. ఈ బైక్‌కు సంబంధించి తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








