రాయల్ ఎన్‌ఫీల్డ్ నెక్స్ట్ లాంచ్: కెఫే రేసర్ 535

By Ravi

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా పేరొందిన ప్రముఖ లీజర్, టూరింగ్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ తర్వాతి ఉత్పత్తిని భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచిన 'కెఫే రేసర్ 535' మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఈ ఏడాది మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రత్యేకించి యువతను దృష్టిలో ఉంచుకొని రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన ఈ మోటార్‌సైకిల్‌ను ఈ ఏడాదిలో విడుదల చేస్తామని, గతంలో సరికొత్త అప్‌గ్రేడెడ్ థండర్‌బర్డ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సందర్భంగా కంపెనీ అధికారులు స్పష్టం చేశారు. గతంలో మిలాన్‌లో జరిగిన ఈఐసిఎమ్ఏ ఆటో షోలో ఉత్పత్తి సిద్ధంగా ఉన్న ప్రొడక్షన్ వెర్షన్ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

Royal Enfield Cafe Racer

కెఫే రేసర్ 535 రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న ఇతర మోటార్‌సైకిళ్ల మాదిరిగా కాకుండా, తక్కువ దూరాలు ప్రయాణించే వారి కోసం, ప్రత్యేకించే వేగం అంటే ఇష్టపడే యువతను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయటం జరిగినది. ఒకరకంగా చెప్పాలంటే, ఇదొక రేస్ బైక్ అనొచ్చు. ఇందులో శక్తివంతమైన 535సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది తేలిక బరువును కలిగి ఉండి ఎక్కువ వేగంతో పరుగులు తీస్తుంది.

ఆకర్షనీయమైన డిజైన్, క్లాసిక్ స్పోక్ వీల్స్, ముందు మరియు వెనుక చక్రాలకు అమర్చిన డిస్క్ బ్రేక్, స్ప్లిట్ హ్యాండిల్ బార్, హ్యాండిల్‌పై చివర్లో అమర్చిన సైడ్ వ్యూ మిర్రర్స్, మెరుగైన సస్పెన్షన్, డిజిటల్ అనలాగ్ కాంబినేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్ సొంతం. దేశీయ విపణిలో దీని ధర రూ.2 లక్షల రేంజ్‍‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, March 26, 2013, 11:51 [IST]
English summary
Royal Enfield, the premium Indian cruiser bike manufacturer will introduce a new Cafe Racer styled motorcycle later in 2013, CarTrade has learned from sources. Besides that, the company is also planning on entering the quarter liter market with its first ever 250cc motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+