క్లాసిక్ వెస్పా స్కూటర్స్ : అప్పటి నుండి ఇప్పటి వరకూ

స్కూటర్ ప్రియులకు ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ 'వెస్పా' కొత్తగా పరిచయాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ద్విచక్ర వాహన విభాగంలో ఓ విప్లవాన్ని సృష్టి వెస్పా స్కూటర్లు ప్రస్తుతం కేవలం చరిత్రకు మాత్రమే పరిమితమైపోయాయి. ఇటలీకు చెందిన ఆటోమొబైల్ బ్రాండ్ పియాజ్జియో తమ వెస్పా స్కూటర్ బ్రాండ్‌ను 1946లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత విడుదల చేసింది.

యుద్ధ సమయంలో ఈ వెస్పా స్కూటర్లు కీలక పాత్రను పోషించాయనే చెప్పాలి. అప్పట్లో గతుకుల రోడ్లకు అనుగుణంగా, చిన్నపాటి క్యానన్‌లను తరలించేందుకు వీలుగా వెస్పా తమ స్కూటర్లను సిద్ధం చేసింది. దీని విశిష్టమైన డిజైన్ వెస్పా స్కూటర్‌కు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం మన ఉపయోగిస్తున్న ఆటోమేటిక్ స్కూటర్లకు మూలం అప్పటి వెస్పా స్కూటర్లేనని చెప్పొచ్చు.

1960లో ప్రాంతంలో వెస్పా స్కూటర్ల ఇండియాలోకి ప్రవేశించాయి. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో ఇటలీకు చెందిన పియాజ్జియో నుంచి లైసెన్సున పొంది, భారత్‌లో స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభిచింది. అయితే, పియాజ్జియోతో బజాజ్ ఆటో ఈ కాంట్రాక్ట్‌ను 1971లో రెన్యువల్ చేసుకోలేదు. దీంతో 1983లో వెస్పా స్వతహాగా ఇండియాలోకి ప్రవేశించి ఎల్ఎమ్ఎల్, పి-సిరీస్ స్కూటర్ల విక్రయాన్ని ప్రారంభించింది.

కానీ 1999లో ఎల్ఎమ్ఎల్, వెస్పాల భాగస్వామ్యం ముగిసిపోయింది. ప్రస్తుతం పియాజ్జియో 2012 సంవత్సరంలో తమ సరికొత్త స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్125తో భారత మార్కెట్లో మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మాత్రం ఎవ్వరితో భాగస్వామ్యం పెట్టుకోకుండా, పూర్తిగా 100 శాతం పియాజ్జియో భారతీయ అనుబంధ కంపెనీ తమ వెస్పా బ్రాండ్‌కు ఇక్కడి మార్కెట్లో మళ్లీ జీవం పోసింది. మరి వెస్పా ఆరంభం నుండి ఇప్పటి వరకూ చెందిన రూపాంతాలను ఈ ఫోటో ఫీచర్‌లో చూద్దాం రండి..!

1945 ఎమ్‌పి6 ప్రోటోటైప్

1945 ఎమ్‌పి6 ప్రోటోటైప్

మొట్టమొదటి వెస్పా స్కూటర్ కాన్సెప్ట్ (ప్రొడక్షన్ వెర్షన్‌కు). ఈ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని వెస్పా తమ తొలి స్కూటర్‌ను తయారు చేసింది.

1946 వెస్పా 98

1946 వెస్పా 98

ప్రొడక్షన్ వెర్షన్ వెస్పా స్కూటర్

1949 వెస్పా తొలి 125సీసీ స్కూటర్

1949 వెస్పా తొలి 125సీసీ స్కూటర్

1949లో వెస్పా తమ తొలి 125సీసీ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

1950 - వెస్పా మోటార్‌స్పోర్ట్ కాన్సెప్ట్

1950 - వెస్పా మోటార్‌స్పోర్ట్ కాన్సెప్ట్

మోటార్‌స్పోర్ట్స్‌ను ప్రమోట్ చేసేందుకు గాను వెస్పా ఈ కాన్సెప్ట్ స్కూటర్‌ను డిజైన్ చేసింది.

1951 - వెస్పా 125 సీ గిరోని

1951 - వెస్పా 125 సీ గిరోని

పిలియన్ రైడర్ సీట్, ముందువైపు స్టెప్నీను ఏర్పాటు చేసిన 125సీసీ వెస్పా స్కూటర్. ఈ మోడల్ పేరు సీ గిరోని.

1951 సిల్యురో

1951 సిల్యురో

1951 సిల్యురో ప్రోటోటైప్ (కాన్సెప్ట్ స్కూటర్).

1956 వెస్పా 150 టిఏపి

1956 వెస్పా 150 టిఏపి

యుద్ధంలోని సైన్యం కోసం వెస్పా అభివృద్ధి చేసిన 150 టిఏపి స్కూటర్ ఇది.

1959 - వెస్పా 50 ఎలెస్టార్ట్

1959 - వెస్పా 50 ఎలెస్టార్ట్

ఎలక్ట్రిక్ స్టార్ట్ సిస్టమ్‌తో రూపొందించిన మొట్టమొదటి స్కూటర్ ఈ 1959 - వెస్పా 50 ఎలెస్టార్ట్.

1964 - వెస్పా 50

1964 - వెస్పా 50

1964 మోడల్ వెస్పా స్కూటర్

1965 - వెస్పా 180 ఎస్ఎస్

1965 - వెస్పా 180 ఎస్ఎస్

1967 - వెస్పా ఆల్ఫా ప్రోటోటైప్

1967 - వెస్పా ఆల్ఫా ప్రోటోటైప్

హెలికాఫ్టర్ టైప్ కాన్సెప్ట్ స్కూటర్‌ను తయారు చేసిన వెస్పా

1968 - వెస్పా 125 ప్రైమావెరా

1968 - వెస్పా 125 ప్రైమావెరా

1968 మోడల్ వెస్పా స్కూటర్

1968 - వెస్పా 180 ర్యాలీ

1968 - వెస్పా 180 ర్యాలీ

1968 మోడల్ వెస్పా స్కూటర్

1976 - వెస్పా 125 ప్రైమావెరా ఈటి3

1976 - వెస్పా 125 ప్రైమావెరా ఈటి3

1976 - వెస్పా ర్యాలీ 200

1976 - వెస్పా ర్యాలీ 200

1976 మోడల్ వెస్పా స్కూటర్

1977 - వెస్పా గిగాంటే

1977 - వెస్పా గిగాంటే

1977 మోడల్ వెస్పా స్కూటర్

1978 - వెస్పా పి125ఎక్స్

1978 - వెస్పా పి125ఎక్స్

1978 మోడల్ వెస్పా స్కూటర్

ఎమ్‌పి5 (మోటో పియాజ్జియో 5)

ఎమ్‌పి5 (మోటో పియాజ్జియో 5)

మోటార్‌స్పోర్ట్స్ కోసం పియాజ్జియో తయారు చేసిన స్కూటర్

వెస్పా 150 జిఎల్

వెస్పా 150 జిఎల్

వెస్పా ఎల్ఎక్స్125

వెస్పా ఎల్ఎక్స్125

ప్రస్తుతం పియాజ్జియో దేశీయ విపణిలో అందిస్తున్న వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్.

క్లాసిక్ వెస్పా స్కూటర్స్

క్లాసిక్ వెస్పా స్కూటర్స్

మరి ఈ క్లాసిక్ వెస్పా స్కూటర్స్ మీకు నచ్చాయా..?

More from DriveSpark

Article Published On: Friday, February 8, 2013, 15:32 [IST]
English summary
Vespa, the Italian scooter brand whose popularity is growing in India following the launch of the LX 125 premium lifestyle scooter, has a unique history. Named after the Italian word for wasp, the Piaggio owned scooter brand has gained popularity over the years through its distinct looking scooters. Piaggio launched the Vespa brand of scooters in 1946 after the end of the second World War.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+