రెండు నెలల్లోనే 145 'హ్యోసంగ్ ఆక్విలా ప్రో' బైక్‌ల విక్రయం
కొరియాకు చెందిన ప్రముఖ ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీ కంపెనీ హ్యోసంగ్ గడచిన జనవరి నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 హాట్ కేకుల్లా అమ్మడుతుపోతుంది. కంపెనీ ఇప్పటి వరకూ మొత్తం 145కు పైగా ఆక్విలా ప్రో బైక్‌లను విక్రయిచింది. తమ సరికొత్త లీజర్ మోటార్‌సైకిల్‌కు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన లభిస్తోందని కంపెనీ ఓ ప్రకనటలో పేర్కొంది.
హ్యోసంగ్ మరియు డిఎస్‌కే మోటోవీల్స్ జనవరి 16, 2013న హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 లీజర్ మోటార్‌సైకిల్‌తో పాటుగా హ్యోసంగ్ జిటి650ఆర్ స్పోర్ట్స్ బైక్‌ను కూడా విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు ఇలా ఇన్నాయి:
- హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 ధర - రూ.4.99 లక్షలు
- 2013 హ్యోసంగ్ జిటి650ఆర్ ధర రూ.4.69 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 మోటార్‌సైకిల్‌లో హ్యోసంగ్ జిటి650ఆర్‌లో ఉపయోగించిన 650సీసీ లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 62 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, లైట్-వెయిట్ అల్లాయ్ వీల్స్, రియర్ డిస్క్ బ్రేక్, అడ్జస్టబల్ 43 ఎమ్ఎమ్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ వంటివి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఫీచర్లు. దీని గరిష్టం వేగం గంటకు 195 కిలోమీటర్లు.

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650



Click it and Unblock the Notifications








