భారత్‌లో 3 బైక్‌లను విడుదల చేయనున్న ఎరిక్ బ్యూయెల్ రేసింగ్

హీరో హోండా జాయింట్ వెంచర్ నుండి విడిపోయిన తర్వాత హీరో మోటోకార్ప్ అమెరికాకు చెందిన ప్రముఖ మోటార్‌సైకిల్ కంపెనీ "ఎరిక్ బ్యూయెల్ రేసింగ్" (ఈబిఆర్)తో సాంకేతి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాన్ని ఆసరగా చేసుకొని ఈబిఆర్ (ఎరిక్ బ్యూయెల్ రేసింగ్) భారత మార్కెట్లో తమ హై-ఎండ్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈబిఆర్ నుంచి అత్యంత పాపులర్ అయిన 1125సీసీ వి-ట్విన్ ఇంజన్‌ను ఆధారంగా చేసుకొని కొత్త మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేయనుంది.

ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ఈ మూడ మోడళ్లకు సంబంధించిన టీజర్లను విడుదల చేసింది. వాటికి ఆర్ఎక్స్, ఎస్ఎక్స్, ఏఎక్స్ (RX, SX, AX) అనే పేర్లను ఖరారు చేసింది. ఇవి తక్కువ ధర కలిగిన స్పోర్ట్స్ బైక్‌లని, వీటి ధర 20,000 డాలర్ల కన్నా తక్కువగా (సుమారు రూ.10 లక్షలు) ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇవి ఇండియన్ మార్కెట్లో హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలువనున్నాయి. అయితే, ఇవి భారత్‌కు రావటానికి మాత్రం మరొక సంవత్సరం పట్టే అవకాశం ఉంది.

Eric Buell Set To Launch 3 New Motorcycles In India

ఇదిలా ఉండగా, హోండా సిబిఆర్ 250ఆర్ హ్యోసంగ్ జిటి 250ఆర్, కవాసకి నిన్జా 250ఆర్ వంటి మోడళ్లకు ధీటుగా హీరో మోటోకార్ప్ ఓ స్పోర్ట్స్ బైక్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈబిఆర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని హీరో మోటోకార్ప్ ఈ బైక్‌ను తయారు చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా నుంచి కొందరు టెక్నీషియన్లు హీరో మోటోకార్ప్ అమెరికాకు పంపించింది. గతంలో ఓ సందర్భంలో హీరో మోటోకార్ప్ ఎమ్‌డి, సీఈఓ పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ కలిగిన సూపర్ బైక్స్ సెగ్మెంట్‌ను తాము ఇన్నాళ్లు మిస్ అయ్యామని, ఇకపై ఈ సెగ్మెంట్లో కూడా తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పనున్నామని వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ మార్కెట్లలో హై-ఎండ్ మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ ఏర్పడితే, భారత్‌లో హై-ఎండ్ ఇంజన్లను కూడా ఉత్పత్తి చేస్తామని, అలాగే విదేశీ మార్కెట్లలో కూడా వీటిని ఉత్పత్తి చేస్తామని ఆయన అన్నారు. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన హైబ్రిడ్ స్కూటర్ 'లీప్‌'ను ఈబిఆర్‌తో కలిసి హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేసింది. ఈబిఆర్‌తో హీరో మోటోకార్ప్‌కు కుదిరిన ఒప్పందం ప్రకారం, హీరో మోటోకార్ప్ భవిష్యత్తులో మార్కెట్లోకి తీసుకురానున్న మోడళ్లకు అవసరమైన కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ, డిజైన్ నుండి డెవలప్‌మెంట్ వరకూ ఈబిఆర్ సేవలను అందించనుంది.

More from DriveSpark

Article Published On: Friday, January 4, 2013, 10:28 [IST]
English summary
Eric Buell Racing, the American sports bike brand and the technology partner of leading Indian motorcycle firm Hero MotoCorp is preparing to launch three new motorcycles. Eric Buell Racing has been developing the motorcycles based on its 1125cc v-twin engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+