ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ నుంచి ఓ సరికొత్త స్పోర్ట్స్ బైక్
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్‌తో సాంకేతిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న అమెరికన్ టూవీలర్ దిగ్గజం 'ఎరిక్ బ్యూయెల్ రేసింగ్' (ఈబిఆర్) వచ్చే నెలలో ఓ సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 1190ఆర్ఎక్స్ అనే పేరుతో ఓ కొత్త స్పోర్ట్స బైక్‌ను అక్టోబర్ నెలలో జరగనున్న 2013 ఎయిఎమ్ఎక్స్‌పోలో ఎరిక్ బ్యూయెల్ రేసింగ్ ఆవిష్కరించనుంది.
కంపెనీ అందిస్తున్న 1190ఆర్ఎస్ హై-ఎండ్ రేస్ బైక్‌కు కుదించబడిన వెర్షనే 1190ఆర్ఎక్స్. ఈబిఆర్ 1190ఆర్ఎస్ తక్కువ బరువును కలిగి ఉండి, రేస్ నుంచి స్ఫూర్తి పొందిన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఈబిఆర్ 1190ఆర్ఎక్స్ బైక్‌లోని కొన్ని ఫీచర్లను (కార్బన్ ఫైబర్ ఫెయిరింగ్, అల్యూమినియం వీల్స్ మొదలైనవి) తొలగించి 1190ఆర్ఎస్‌ను రూపొందించారు. ఫలితంగా దీనిని తక్కువ ధరకే ఆఫర్ చేయనున్నారు. అయినప్పటికీ, ఆర్ఎస్ బైక్‌లో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, పెద్ద సింగిల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లను ఆర్ఎక్స్‌లోను ఉంచే ఆస్కారం ఉంది.
ఇంజన్ విషయానికి వస్తే, ఈబిఆర్ 1190ఆర్ఎస్‌లో అదే 1190సీసీ, లిక్విడ్ కూల్డ్, వి-ట్విన్ రోటక్స్ ఇంజన్‌నే ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఇంజన్‌ను రీట్యూన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేస్ వెర్షన్‌లో ఉపయోగించే ఇదే ఇంజన్ గరిష్టంగా 175 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిఎమ్ ఆటో ఎక్స్‌పో అక్టోబర్ 16, 2013వ తేదీ నుంచి ఫ్లోరిడాలోని ఓర్లాండోలో జరగనుంది.



Click it and Unblock the Notifications








