ప్రతి ఏటా నాలుగు కొత్త ఉత్పత్తులు: హోండా మోటార్‌సైకిల్

By Ravi

Honda Dio
జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ ఇండియా స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ప్రతి సంవత్సరం కనీసం నాలుగు కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తామని పేర్కొంది. హెచ్ఎమ్ఎస్ఐ తాజాగా భారత్‌లో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ డి కేంద్రం కొత్త ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి సారిస్తుందని, రానున్న రోజుల్లో ఈ ఆర్ అండ్ డి నుండి అభివృద్ధి చేసిన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేస్తామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్న ఉత్పత్తి కేంద్రం కోసం 2,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని మోటార్‌సైకిల్ ఇండియా స్కూటర్ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ కీటా మురమత్సు తెలిపారు. ఆర్ అండ్ డి సెంటర్, హెచ్ఎమ్ఎస్ఐ టెక్నికల్ సెంటర్లలో మొత్తం 200 మంది ఇంజనీర్లు, డెవలపర్లు ఉన్నారని ఆయన తెలిపారు.

ప్రస్తుతం ఈ ఆర్ అండ్ డి కేంద్రంలో నాలుగు కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నామని, వీటిల్లో మొదటి ఉత్పత్తి 2013-14 ఆర్థిక సంవత్సరంలో విడుదల అవుతుందని హెచ్ఎమ్ఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యద్విందర్ ఎస్ గులేరియా తెలిపారు. రానున్న రోజుల్లో మోటార్‌సైకిళ్లు, స్కూటర్లలో సరికొత్త మోడళ్లు, రిఫ్రెష్డ్ వెర్షన్లు తమ కంపెనీ అభివృద్ధి చేసి విడుదల చేస్తుందని ఆయన చెప్పారు.

కాగా.. కంపెనీ ఇటీవలే రిఫ్రెష్డ్ ఆక్టివా, డియో, ఏవియేటర్ స్కూటర్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిఫ్రెష్డ్ స్కూటర్ల మైలేజ్‌ గతంలో లీటరుకు 54 కి.మీ. ఉండగా ప్రస్తుతం దీనిని లీటరుకు 60 కి.మీ. లకు పెంచారు. ఈ అప్‌గ్రేడెడ్ 2013 స్కూటర్లలో కొత్త 'హోండా ఎకో టెక్నాలజీ' (హెచ్ఈటి)ను ఉపయోగించారు. ఇంజన్ పవర్ ఏ మాత్రం తగ్గకుండా మెరుగైన మైలేజీని అందిచటంలో ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 23, 2013, 14:01 [IST]
English summary
Honda Motorcycles and Scooters India (HMSI) has annouced that, it will launch at least four products every year. "Our plan is to launch at least four products every year from this R&D centre. As India becomes a global innovation hub for Honda, customers can look forward to new products faster," HMSI President and CEO Keita Muramatsu said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+