మహీంద్రా మోజో బైక్‌కు ఉరి వేసిన లోహియా ఆటో
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని లోహియా గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ విభాగం 'లోహియా ఆటో' తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రచారం చేయటం కోసం మహీంద్రా టూవీలర్స్ నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న 350సీసీ బైక్ మోజోను కించపరిచేలా ప్రకటన చేసింది. అధిక ఖర్చుతో కూడిన పెట్రోల్ మోటార్‌సైకిళ్లు వద్దు, అతి తక్కువ ఖర్చుతో నడిచే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లే ముద్దు అంటూ లోహియా ఓ ప్రకటనను తయారు చేసింది.
ఈ ప్రకటనలో మహీంద్రా మోజో మోటార్‌సైకిల్‌కు ఉరి వేసి, ఖరీదైన పెట్రోల్, కాలుష్య వాహనాలకు స్వస్తి పలకండి, ప్రకృతికి హాని కలిగించని తమ ఎలక్ట్రిక్ వాహనాలను ట్రై చేయండంటూ లోహియా ఆటో ఓ పోస్టర్‌ను ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. మహీంద్రా మోజో 350సీసీ మోటార్‌సైకిల్ మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల కానుంది. గత కొద్ది సంవత్సరాలుగా వాయిదా పడతూ వస్తున్న ఈ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ ఇప్పుడిప్పుడే సన్నాహాలు చేస్తుంటే, లోహియా ఇలా షాక్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రకటనకు సంబంధించిన ఫోటోలను చూడండి..!

లోహియా ఆటో ప్రకటన
ప్రకటనలో మహీంద్రా మోజో 350సీసీ బైక్‌కు ఉరి వేసిన లోహియా ఆటో.

లోహియా ఆటో ప్రకటన
లోహియా ఆటో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రమోట్ చేస్తూ చేసిన ప్రకటన.

మహీంద్రా మోజో
లోహియా తమ ప్రకటనలో ఉపయోగించిన మహీంద్రా మోజో బైక్ చిత్రం.

లోహియా ఆటో ప్రోమో
ఫేస్‌బుక్‌లో లోహియా ఆటో ప్రమోట్ చేసిన ప్రకటన.

లోహియా ఆటో ప్రోమో
లోహియా ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ప్రకటన.

లోహియా ఆటో ప్రోమో
లోహియా జీనియస్ ఎలక్ట్రిక్ స్కూటర్

లోహియా ఆటో ప్రోమో
లోహియా జీనియస్ ఎలక్ట్రిక్ స్కూటర్

లోహియా ఆటో ప్రోమో
లోహియా జీనియస్ ఎలక్ట్రిక్ స్కూటర్

లోహియా ఆటో ప్రోమో
లోహియా ఓఎమ్ఏ ఎలక్ట్రిక్ స్కూటర్

లోహియా ఆటో ప్రోమో
లోహియా ఆటిట్యూడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

లోహియా ఆటో ప్రోమో
మహీంద్రా మోజో 350సీసీ మోటార్‌సైకిల్

లోహియా ఆటో ప్రోమో
మహీంద్రా మోజో 350సీసీ మోటార్‌సైకిల్


Click it and Unblock the Notifications








