భారత్‌లో ఫాస్ట్రాక్ హెల్మెట్లు విడుదల - ధరలు వేరియంట్లు
ఫాస్ట్రాక్ (Fastrack) అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేవి ఖరీదైన వాచ్‌లు, కళ్లజోళ్లు. కానీ ఇకపై ఫాస్ట్రాక్ అంటే మోటారిస్టులు ధరించే హెల్మెట్లు కూడా గుర్తుకు రానున్నాయి. టైటన్ ఇండస్ట్రీస్‌కు చెందిన లైఫ్‌స్టైల్ బ్రాండ్ 'ఫాస్ట్రాక్' ద్విచక్ర వాహనాలపై వెళ్లే మోటారిస్టుల కోసం సరికొత్త హెల్మెట్లను తయారు చేసింది.
హెల్మెట్లను తయారు చేయాలన్న తమ ప్రణాళికను ఈ ఏడాది ఆగస్ట్ నెలలోనే టైటన్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ మీడియాకు వివరించిన సంగతి తెలిసినదే. అయితే, ఆ సమయంలో ఫాస్ట్రాక్ బ్రాండ్ ఈ హెల్మెట్లను విడుదల చేస్తామని మాత్రం ఆయన వెల్లడించలేదు.
ఫాస్ట్రాక్ బ్రాండ్ అంటే, ఇప్పటికే యువతలో మంచి క్రేజ్ ఉంది. అలాంటి ఈ బ్రాండ్‌తో వస్తున్న హెల్మెట్లకు కూడా మంచి గిరాకీ ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది. కాగా.. ఫాస్ట్రాక్ అన్ని రకాల హెల్మెట్లను (ఫుల్ ఫేస్, హాఫ్ ఫేస్, మోటోకార్స్ స్టైల్ మొదలైనవి) ఆఫర్ చేస్తోంది.

దేశీయ విపణిలో ఫాస్ట్రాక్ హెల్మెట్ల ధరలు రూ.1,495 నుంచి రూ.3,495 మధ్యలో ఉన్నాయి. గతంలో ప్రకటించినట్లుగానే, టైటన్ ఈ హెల్మెట్లను తమ స్వంతగా తయారు చేయటం లేదు. ప్రపంచంలో కెల్లా అతి ప్రముఖమైన మోటార్‌సైకిల్ యాక్ససరీ తయారీదారైన, ఇటలీకి చెందిన ఏజివి సంస్థతో టైటన్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా, ఏజివి గుజరాత్‌లో తయారు చేసిన హెల్మెట్లను ఫాస్ట్రాక్ బ్రాండ్‌తో విక్రయించనున్నారు. ప్రపంచంలో కెల్లా అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కలిగిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటని, ఇక్కడి మార్కెట్లో హెల్మెట్లకు మంచి గిరాకీ ఉంటుందని ఆశిస్తున్నామని భాస్కర్ భట్ తెలిపారు.


Click it and Unblock the Notifications








