యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 ఇప్పుడు కొత్త రంగుల్లో

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం మోటార్‌సైకిల్ 'యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0'లో సరికొత్త కలర్ ఆప్షన్‌లను పరిచయం చేసింది. స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఆకట్టుకునేలా నాలుగు ఆకర్షనీయమైన రంగులలో కొత్త యమహా ఆర్15 బైక్‌ను కంపెనీ అందిస్తోంది. ఇది థండరింగ్ గ్రీన్, ఇన్విసిబల్ బ్లాక్, రేసింగ్ బ్లూ, రేరింగ్ రెడ్ అనే కొత్త రంగుల్లో లభ్యమవుతోంది. యమహా ఆర్15 మోటార్‌‌సైకిల్ కొత్త కలర్ ఆప్షన్‌లను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు. ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది..?

యమహా ఆర్15 మోటార్‌సైకిల్‌లో అమర్చిన 150సీసీ లిక్విడ్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ గరిష్టంగా 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17 బిహెచ్‌పిల శక్తిని, 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా ఆర్15 బాక్‌లో స్ప్లిట్ సీట్, వెడల్పాటి వెనుక టైరు, కొత్త టెయిల్ కౌల్, సరికొత్త మిడిల్ కౌల్ డిజైన్, రియర్ డిస్క్ బ్రేక్‌, రీడిజైన్ చేయబడిన సైలెన్సర్‌, బైక్ వెనుక భాగాన అమర్చిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ కోటింగ్ ఇంజన్‌లు, డబుల్ హారన్, డిజైనర్ రియర్ మడ్‌గార్డ్, అల్యూమినియం స్వింగ్ఆర్మ్, లింక్డ్ టైప్ మోనోక్రాస్ సస్పెన్షన్‌ వంటి అనేక విశిష్టతలు ఉన్నాయి.

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - థండరింగ్ గ్రీన్

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - థండరింగ్ గ్రీన్

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - రేసింగ్ బ్లూ

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - రేసింగ్ బ్లూ

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - రేరింగ్ రెడ్

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - రేరింగ్ రెడ్

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - ఇన్విసిబల్ బ్లాక్

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 - ఇన్విసిబల్ బ్లాక్

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

ఇంజన్:

* ఇంజన్ టైప్ : లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్

* సిలిండర్ అరేంజ్‌మెంట్ : సింగిల్ సిలిండర్

* డిస్‌ప్లేస్‌మెంట్ : 149.8సీసీ

* బోర్ × స్ట్రోక్ : 57 ఎమ్ఎమ్ × 58.7 ఎమ్ఎమ్

* కంప్రెషన్ రేషియో : 10.4:1

* గరిష్ట పవర్ : 17 పిఎస్ / 8500 ఆర్‌పిఎమ్

* గరిష్ట టార్క్ : 15 ఎన్ఎమ్ / 7500 ఆర్‌పిఎమ్

* స్టార్టింగ్ సిస్టమ్ : ఎలక్ట్రిక్ స్టార్ట్

* లూబ్రికేషన్ : వెట్ సంప్

* ఇంధన ట్యాంక్ సామర్థ్యం : 12 లీటర్లు

* ఇంధన సరఫరా సిస్టమ్ : ఫ్యూయెల్ ఇంజెక్షన్

* ఇగ్నిషన్ సిస్టమ్ : టి.సి.ఐ

* ప్రైమరీ / సెకండరీ రిడక్షన్ రేషియో : 3.042 / 3.133

* క్లచ్ టైప్ : వెట్ మల్టిపుల్-డిస్క్

* ట్రాన్సిమిషన్ టైప్ : రిటర్న్ టైప్ 6-స్పీడ్

* గేర్ రేషియో : 1st = 2.833, 2nd = 1.875, 3rd = 1.364, 4th = 1.143, 5th = 0.957, 6th = 0.84

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

ఛాస్సిస్ :

* ఫ్రేమ్ టైప్ : డెల్టా బాక్స్

* క్యాస్టర్ / ట్రైల్ : 26° / 98mm

* టైర్ సైజ్ (ముందు మరియు వెనుక) : 90/80-17 మరియు 130/70-ఆర్17

* బ్రేక్ టైప్ (ముందు మరియు వెనుక) : హైడ్రాలిక్, సింగిల్ డిస్క్

* సస్పెన్షన్ టైప్ (ముందు మరియు వెనుక) : టెలిస్కోపిక్ / లింక్డ్ టైప్ మోనోక్రాస్

* హెడ్ లైట్ : లోబీమ్ 12వీ/35డబ్ల్యూ ఎక్స్1, హైబీమ్ 12వీ/35డబ్ల్యూ ఎక్స్2

* బ్యాటరీ : 12వీ, 3.5ఏహెచ్ (10హెచ్)

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

కొలతలు:

* మొత్తం పొడవు × వెడల్పు × ఎత్తు : 1970 ఎమ్ఎమ్ × 670 ఎమ్ఎమ్ × 1,070 ఎమ్ఎమ్

* సీట్ ఎత్తు : 800 ఎమ్ఎమ్

* వీల్‌బేస్ : 1345 ఎమ్ఎమ్

* మినిమమ్ గ్రౌండ్ క్లియెరెన్స్ : 160 ఎమ్ఎమ్

* కెర్బ్ వెయిట్ : 136 కేజీలు

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0

లభించే రంగులు:

* రేసింగ్ బ్లూ (ప్రస్తుతం రంగు)

* సన్‌సెట్ రెడ్ (ప్రస్తుతం రంగు)

* మిడ్‌నైట్ బ్లాక్ (ప్రస్తుతం రంగు)

* థండరింగ్ గ్రీన్ (కొత్త రంగు)

* ఇన్విసిబల్ బ్లాక్ (కొత్త రంగు)

* రేసింగ్ బ్లూ (కొత్త రంగు)

* రేరింగ్ రెడ్ (కొత్త రంగు)

* ఫైరీ రెడ్ (స్పెషల్ ఎడిషన్)

* డబ్ల్యూజిపి 50వ వార్షికోత్సవ ఎడిషన్

భారత మార్కెట్లో కొత్త యమహా వైజెడ్ఎఫ్ ఆర్15 వెర్షన్ 2.0 ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Article Published On: Saturday, January 5, 2013, 12:23 [IST]
English summary
India Yamaha Motor has introduced four new paint works for its R15 2.0 Sports Motorcycle. New Yamaha YZF R15 Version 2.0 is now available in Thundering Green, Invincible Black, Racing Blue & Raring Red along with the existing colours.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+